నెల్లూరు, సాక్షి : సోమశిల జలాశయానికి తానే ఆద్యుడిగా సీఎం చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని నెల్లూరు వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. 1995 నుంచి 2004 వరకూ అయన ముఖ్యమంత్రిగా ఉన్నారు..ఏనాడైనా సమగ్ర సోమశిల గురించి ఆలోచించారా..? అని ప్రశ్నించారు.
‘‘అప్పట్లో 36 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండేది. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే సోమశిల సామర్థ్యాన్ని 78 టీఎంసీలకు పెంచారు. అదేవిధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని కూడా 40 వేల క్యూసెక్కులకు పెంచారు. అప్పట్లో తెలంగాణలోని కాంగ్రెస్ వాదులు దీనిని వ్యతిరేకించినా.. రాజశేఖర్ రెడ్డి ఖాతర చేయలేదు. 14 ఏళ్లల్లో ఎప్పుడూ పెన్నార్ డెల్టా అధునికీకరణ గురించి పట్టించు కోలేదు. సంగం...నెల్లూరు బ్యారేజ్‌ల నిర్మాణాన్ని పట్టించుకోలేదు.. మేమే పూర్తి చేశాం అని అన్నారాయన.
.. సంగం బ్యారేజ్‌కు మంత్రిగా ఉంటూ మరణించిన గౌతమ్ రెడ్డి పేరు పెడితే దానిని చంద్రబాబు తొలగించారు. నెల్లూరు బ్యారేజ్‌కు మాజీ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేరు పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పేర్లు మార్చడం తప్ప ఏం అభివృద్ది చేశారో చెప్పాలి చంద్రబాబు అని డిమాండ్ చేశారు. సోమశిల మరమ్మతులకు వైఎస్సార్‌సీపీ హయాంలోనే పునాది పడింది. 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారని చంద్రబాబు అన్నారు.1995లో ఆయన ట్రాక్ రికార్డ్ బాగా లేదు..అందుకే ఆందోళన కలుగుతోంది. సోమశిల జలాశయం పనులు నాణ్యతతో చేయాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment