
నూతనంగా నిర్మించిన గుడిలో ప్రతిష్టించిన తల్లిదండ్రుల విగ్రహాలు
విడవలూరు: తల్లిదండ్రులపై ఉన్న మమకారంతో కుమారుడు తన తల్లిదండ్రులకు గుడి కట్టి అందులో విగ్రహాలను ప్రతిష్టించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాళెం మండలంలోని నాగమాంబపురం పంచాయతీ పరిధిలోని కొట్టాలకి చెందిన పుట్టా సుబ్రమణ్యంనాయుడు (జొన్నవాడ ఆలయ చైర్మన్) గ్రామంలో తన సొంత స్థలంలో తల్లిదండ్రులకు గుడి కట్టించాడు.
తన తల్లి పుట్టా సుబ్బమ్మ మొదటి వర్థంతి సందర్భంగా నూతనంగా నిర్మించిన గుడిలో తన తండ్రి పుట్టా రామయ్య, తల్లి పుట్టా సుబ్బమ్మ విగ్రహాలను ప్రతిష్టించారు. అనంతరం గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment