
సాక్షి, నెల్లూరు: జిల్లాలోని మనుబోలు సమీపంలోని కోల్‌కత-చెన్నై జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సు టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి పంట పొలాల్లో బోల్తాపడింది. ఈప్రమాదంలో కరీమా అనే వృద్ధురాలు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను నెల్లూరు, గూడూరులోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలిసింది. ఇదిలాఉండగా బస్సు ప్రమాద స్థలంలోనే వెనకే వచ్చిన ఓ లారీ డ్రైవర్ అయోమయానికి గురయ్యాడు. సడన్ బ్రేకులు వేయడంతో లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన పల్టీ కొట్టింది. అయితే, డ్రైవర్ ఎటువంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడ్డాడు.
చదవండి👉🏾 పేలిన తూటాలు.. రాలిన ప్రాణాలు.. ఉలిక్కిపడిన తాటిపర్తి
Comments
Please login to add a commentAdd a comment