Manubolu
-
మనుబోలు–గూడూరు మధ్య రైల్వే ఫ్లైఓవర్ ప్రారంభం
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ)/మనుబోలు: విజయవాడ డివిజన్లోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు–తిరుపతి జిల్లా గూడూరు మధ్య మూడవ రైల్వే లైను పనుల్లో భాగంగా గూడూరు సమీపంలోని పంబలేరు నదిపై రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) నిర్మించిన పొడవైన రైల్వే ఫ్లైఓవర్‌ను శుక్రవారం ప్రారంభించారు. మనుబోలు–గూడూరు మధ్య సుమారు 10 వరకూ కాలువలు, ఏర్లు ఉన్నాయి. వీటిలో గూడూరు సమీపంలోని పంబలేరు పెద్దది. దీంతో పాటు సమీపంలోని కొన్ని కాలువలను కలుపుకుని 2.2 కిలోమీటర్ల దూరంతో అతి పొడవైన రైల్వే ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ఈ రైల్వే ఫ్లైఓవర్ దక్షణ మధ్య రైల్వేలో 7వ పెద్ద ఆర్వోఆర్గా నిలిచిందని రైల్వే అధికారులు తెలిపారు. జోన్లో అతి పొడవైన ఆర్వోఆర్ కూడా ఇదేనని పేర్కొన్నారు. దీని నిర్మాణంలో హైగ్రేడ్ కాంక్రీట్, స్ట్రక్చరల్ స్టీల్‌ను ఉపయోగించినట్లు తెలిపారు. ఈ సింగిల్ లైన్ వంతెన రెండు దిశలలో రైళ్ల కదలికల కోసం రూపొందించారు. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రైళ్ల రాకపోకలను సులభతరం చేయడానికి ఈ ఫ్లైఓవర్ ఉపకరిస్తుంది. ఈ ఫ్లైఓవర్ వల్ల గూడూరు స్టేషన్ మీదుగా విజయవాడ నుంచి రేణిగుంట, చెన్నై మధ్య ఏకకాలంలో నడిచే రైళ్ల రాకపోకలకు ఇక అంతరాయం ఉండదు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే ఫ్లైఓవర్‌ను నిరి్మంచడంలో కృషి చేసిన రైల్వే అధికారులు, ఆర్వీఎన్ఎల్ సంస్థ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా.. ఒకరు మృతి, 15 మందికి గాయాలు
సాక్షి, నెల్లూరు: జిల్లాలోని మనుబోలు సమీపంలోని కోల్‌కత-చెన్నై జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సు టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి పంట పొలాల్లో బోల్తాపడింది. ఈప్రమాదంలో కరీమా అనే వృద్ధురాలు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను నెల్లూరు, గూడూరులోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలిసింది. ఇదిలాఉండగా బస్సు ప్రమాద స్థలంలోనే వెనకే వచ్చిన ఓ లారీ డ్రైవర్ అయోమయానికి గురయ్యాడు. సడన్ బ్రేకులు వేయడంతో లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన పల్టీ కొట్టింది. అయితే, డ్రైవర్ ఎటువంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడ్డాడు. చదవండి👉🏾 పేలిన తూటాలు.. రాలిన ప్రాణాలు.. ఉలిక్కిపడిన తాటిపర్తి -
ఆ తల్లిదండ్రులకు ఎమ్మెల్యే కుమార్తె చేయూత
సాక్షి, మనుబోలు: కన్న బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులకు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె శ్రీమతి పూజిత చేయూతనిచ్చారు. మనుబోలు మండలం కొమ్మలపూడిలో ఈతకు వెళ్లి చెరువులో మునిగి చనిపోయిన చిన్నారులు హేమంత్, సురేష్‌ల తల్లిదండ్రులు బైనా సుబ్బారెడ్డి–సునీత దంపతులను సోమవారం పూజిత పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి రూ.లక్ష నగదు, బట్టలు, పిండి వంటలు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బిడ్డలను కోల్పోయిన తల్లితండ్రుల దుఖాన్ని ఏమి ఇచ్చినా తీర్చలేమని, తాము చేసే ఆర్థిక సాయం కేవలం వారికి ధైర్యం చెప్పేందుకేనన్నారు. భగవంతుడు వారికి ఆ దుఖాన్ని తట్టుకునే మనో ధైర్యాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు. ఆమె వెంట వైఎస్సార్సీపీ నాయకులు మన్నెమాల శ్రీనివాసులురెడ్డి, చెందులూరు శ్రీనివాసులు, కడివేటి చంద్రశేఖర్‌రెడ్డిŠ, గుమ్మా శ్రీనివాసులు, వేణు ఉన్నారు. -
పచ్చదళం.. లూటీపర్వం
సాక్షి, మనుబోలు : కాదేదీ అవినీతికనర్హం అన్నట్లుగా మండలంలో గత ఐదేళ్ల కాలంలో ప్రతి పనిలోనూ తెలుగు తమ్ముళ్లు వేటినీ వదలకుండా అందిన కాడికి వెనకేసుకున్నారు. మండలంలో సుమారు రూ.20 కోట్లకు పైగా నీరు చెట్టు పనులు చేశారు. అయితే వీటిలో రైతులకు ఉపయోగపడే పనులు చేయకుండా ఏవైతే రైతులకు అవసరం లేదో వాటినైతే ఎవరూ పట్టించుకోరన్న ఉద్దేశంతో అలాంటి పనులనే ఎక్కువగా చేశారు. చేతికందినంత దోచుకున్నారు. పాలకుల కక్కుర్తితో విఫలం గతేడాది బండేపల్లి బ్రాంచ్ కాలువ ద్వారా వచ్చే సాగునీరు సరిపడక పంటలు ఎండిపోతుండడంతో రాజోలుపాడు వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి దాన్ని బ్రాంచ్ కాలువలో కలిపి పంటలు కాపాడాలని భావించారు. ఇందు కోసం సుమారు రూ.50 లక్షల నిధులు కేటాయించారు. అయితే రాజోలుపాడు వద్ద ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ రైతులకు ఎటువంటి ప్రయోజనాలు ఇవ్వకపోగా కాంట్రాక్టర్ బాగా వెనకేసుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. రూ.50 లక్షలతో గతేడాది ఫిబ్రవరిలో రోజులుపాడు లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా రోజులుపాడు సమీపంలోని కండలేరు నుంచి మోటార్లతో నీటిని పంపింగ్ చేసి బండేపల్లి బ్రాంచ్ కెనాల్లో కలిపారు. దిగువనున్న కండలేరు నుంచి ఎగువనున్న బ్రాంచ్ కెనాల్‌కు నీరు వెళ్లాల్సి రావడంతో ఇది విఫలమైంది. రివర్స్ గ్రేడియంట్(దిగువ నుంచి ఎగువకు) నీటిని పారించే క్రమంలో ఎంత వాలిందో కొలతలు తీసుకుని దానిని అధికమించేందుకు ఎంత నీటిని లిఫ్ట్ చేస్తే ఎగువ ప్రాంతానికి ఎంత నీళ్లు పారుతాయో లెక్కకట్టి చేయాల్సి ఉంది. అయితే అధికారులే చెపుతున్న లెక్కల ప్రకారం కనీసం 200 పైగా హార్స్పవర్ మోటార్లు పెడితే తప్పా ఎగువకు నీళ్లు వెళ్లే అవకాశం లేని చోట కేవలం 60 హార్స్పవర్ మోటార్లు, నాలుగు పైపులు ఏర్పాటు చేయడంతో ఈ పథకం పూర్తిగా ఫెయిలయింది. మోటార్ల నుంచి నీళ్ల వచ్చే చోట నాలుగడుగుల లోతు నీరుండగా చివరికొచ్చేసరికి బ్రాంచ్ కాలువలో కలిసే చోట కనీసం అడుగు లోతు నీరు కూడా రాకపోవడంతో ఈ పథకం వృధా ప్రయాసగా మారింది. దీంలో రూ.50 లక్షల ప్రజాధనం దుర్వినియోగం అయింది. లిఫ్ట్‌తో రైతులకేమి ప్రయోజనం కనుపూరు కాలువకు చివరి ఆయకట్టు అయిన మనుబోలు మెట్ట గ్రామాలకు బండేపల్లి బ్రాంచ్ కాలువ నీళ్లు సరిపోకపోవడంతో గతేడాది రూ.50 లక్షలతో రాజోలుపాడు లిఫ్ట్ చేశారు. అయితే తక్కువ కెపాసిటీ ఉన్న నాసిరకం మోటార్లు ఏర్పాటు చేయడం, దిగువ నుంచి ఎగువకు నీటిని మళ్లించడం వల్ల రాజోలుపాడు లిఫ్ట్ విఫల ప్రయత్నంగా మారింది. దీని వల్ల ప్రజాధనం దుర్వినియోగం కావడం తప్పా రైతులకు ఒరిగిందేమీ లేదు. – ఎం.వెంకటేశ్వర్లు, రైతు, రాజోలుపాడు తూతూ మంత్రంగా పూడికతీత కండలేరు ఉప కాలువ, చెరువుల పూడికతీత పనులు, తూములు, కల్వర్టులు, రెండు చెక్‌డ్యాంలు కూడా అవినీతికి అడ్డాగా మారాయి. కండలేరు ఉపకాలువకు ఇరుపైపులా ఉన్న చిన్నచిన్న కంప చెట్లను తొలగించి జేసీబీతో పల్చగా మట్టిని తీసి తూతూ మంత్రంగా పని కానిచ్చేశారు. వాగు అడుగున బోర్లు ఉన్నాయన్న సాకుతో రైతులు తవ్వేందుకు ఒప్పుకోవడం లేదని చెప్పి చాలా చోట్ల అరడుగుల మందంతో గీకి వదిలేశారు. ఆత్మగౌరవం లోనూ.. మరుగుదొడ్లలో కూడా వీరంపల్లి, మడమనూరు, మనుబోలు తదితర చోట్ల భారీగా అవినీతి చోటుచేసుకుంది. వందల సంఖ్యలో మరుగదొడ్లు కట్టకుండానే కట్టినట్లు చూపించారు. పాత మరుగుదొడ్లనే సున్నం, రంగులు వేసి మళ్లీ నిర్మించినట్లు చూపడం, ఒకే ఇంటికి రెండు, మూడు మరుగుదొడ్లు నిర్మించడం ద్వారా భారీగా వెనకేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో అప్పటి వీరంపల్లి పంచాయతీ కార్యదర్శిని కూడా సస్పెండ్ చేశారు. ఒకే ఇంట్లో రెండు మరుగుదొడ్లు అక్రమ తవ్వకాలు వడ్లపూడి, అక్కంపేట, వీరంపల్లి, మడమనూరు, బండేపల్లి, మనుబోలు తదితర గ్రామాల సమీపంలో గ్రావెల్, ఇసుక అక్రమంగా తరలించి భారీగా సొమ్ము చేసుకున్నారు. అదేమని అడిగితే తమకు రెవెన్యూ అధికారుల అనుమతి ఉందని చెప్పి తమ పనులు చెక్కబెట్టుకునేవారు. కొందరు అధికార పార్టీ నాయకులు ఏకంగా ఇసుకను భారీగా డంపింగ్ చేసుకుని తరువాత విక్రయించి సొమ్ము చేసుకున్నారు. -
బైక్‌ను ఢీకొన్న ట్రాక్టర్
ఇద్దరు దుర్మరణం మనుబోలు : రాంగ్ రూట్లో వచ్చిన ఓ ట్రాక్టర్ బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ సంఘటన మండలంలోని కొమ్మలపూడి క్రాస్‌రోడ్డు సమీపంలో శుక్రవారం జరిగింది. మండలంలోని కొండూరుసత్రంకు చెందిన ఆవుల రామయ్య (50), కోట మండలం కొత్తపాళెంకు చెందిన పిగిలం రమేష్(25) కలిసి కొమ్మలపూడిలోని బంధువులను పరామర్శించేందుకు బైక్‌పై వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో కొమ్మలపూడి క్రాస్‌రోడ్డు సమీపంలోని కొత్త పవర్ గ్రిడ్ వద్ద వాకాడుకు చెందిన ఓ ట్రాక్టర్ రాంగ్ రూట్లో ఎదురుగా వేగంగా వచ్చి సైకిల్‌ను ఢీకొంది. దీంతో బైక్‌పై నుంచి ఎగిరి పడ్డ రామయ్య, రమేష్ తీవ్ర గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు హైవేపై పడిపోవడంతో కొద్ది సేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గూడూరు ఎస్సై బాబీ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పక్కకి తీయించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మనుబోలులోని దేవాలయాల్లో దొంగలు బీభత్సం
నెల్లూరు : నెల్లూరు జిల్లా మనుబోలులోని ఆరు దేవాలయాల్లో దోపిడి దొంగలు సోమవారం ఆర్థరాత్రి బీభత్సం సృష్టించారు. హుండీలు పగులగొట్టి నగదు అపహరించారు. ఆ విషయాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సదరు దేవాలయాల వద్దకు చేరుకుని.... దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాళ్లకు ట్యాగ్‌లతో పావురాళ్ల విహారం
మనుబోలు: నంబర్లున్న ట్యాగ్లు కాళ్లకు కట్టి ఉన్న పావురాలు రెండు రోజులుగా తీరంలో విహరిస్తుండడాన్ని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కొలనకుదురు గ్రామస్తులు గుర్తించారు. బుధవారం ఓ పావురాయిని ఒక వ్యక్తి పట్టుకుని పరిశీలించగా దాని కాలికి 1,348 నంబర్ ట్యాగ్ ఉండగా, మరో కాలికి ప్లాస్టిక్ తాడు లాంటిది కట్టి ఉంది. దీంతో గ్రామస్తులు ఏమైవుంటుందో అర్థంకాక ఆందోళన చెందుతున్నారు. సమీపంలో రాకెట్ కేంద్రం ఉండటంతో వీటి సహాయంతో ఏదైనా కుట్రకు పన్నాగం పన్నుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు.. చెన్నైలో పావురాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారని వాటిని గుర్తించేందుకు నంబర్ ట్యాగులు కట్టి కొన్ని కిలోమీటర్ల దూరంలో విడిచి పెడతారని వాటిల్లో ఏది ముందు వదిలిన ప్రదేశానికి వెళితే ఆ పావురం గెలిచినట్లు ప్రకటిస్తారని పేర్కొంటున్నారు. దీనిపై రూ.లక్షల్లో బెట్టింగులు జరుగుతుంటాయి. ప్రస్తుతం కొలనకుదురులో కనిపిస్తున్న పావురాళ్లు ఆ కోవకు చెందినవే అయి ఉంటాయని భావిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
మనుబోలు: నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని జ్యోతినగర్ వద్ద ఆగి ఉన్న లారీని, కార్మికులతో వెళ్తున్న మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఒకరు, చికిత్సపొందుతూ మరొకరు మృతి చెందారు. వీరంతా ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కంకిపాడు నుంచి చిత్తూరుకు పనుల నిమిత్తం వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో లారీ క్లీనర్ రమేశ్(28), మేస్త్రి జాన్ వెస్లీ(32)లు మరణించారు. గాయపడిన వారిని గూడూరు, నెల్లూరు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
శేషాద్రి ఎక్స్ ప్రెస్ లో దొంగల భీభత్సం
నెల్లూరు: నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద శేషాద్రి ఎక్స్ ప్రెస్ లో దొంగలు భీభత్సం సృష్టించారు. రైలు కాకినాడ నుంచి బెంగళూరు వెళ్తుండగా బుధవారం ఈ సంఘటన జరిగింది. మనుబోలు వద్ద రైలు లోకి చొరబడిన దొంగలు చైన్ లాగి దోపిడీకి పాల్పడ్డారు. ఎస్-2, 7, 8 బోగిల్లో ఉన్న ప్రయాణికులను బెదిరించి నగదును, బంగారాన్ని దోచుకెళ్లారు. ప్రయాణికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కారు,ఆటో ఢీ: ఏడుగురికి గాయాలు
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు (మనుబోలు) : మనుబోలు మండలం మడమనూరు సమీపంలో ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఢీకొన్నాయి. శనివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.