ఆ తల్లిదండ్రులకు ఎమ్మెల్యే కుమార్తె చేయూత | Kakani Govardhan Reddy Daughter Helps Parents Who Have Lost Their Children | Sakshi

ఆ తల్లిదండ్రులకు ఎమ్మెల్యే కుమార్తె చేయూత

Jan 14 2020 9:23 AM | Updated on Jan 14 2020 10:29 AM

Kakani Govardhan Reddy Daughter Helps Parents Who Have Lost Their Children - Sakshi

బాధిత కుటుంబానికి నగదు, దుస్తులు అందజేస్తున్న పూజిత

సాక్షి, మనుబోలు: కన్న బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులకు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె శ్రీమతి పూజిత చేయూతనిచ్చారు. మనుబోలు మండలం కొమ్మలపూడిలో ఈతకు వెళ్లి చెరువులో మునిగి చనిపోయిన చిన్నారులు హేమంత్, సురేష్‌ల తల్లిదండ్రులు బైనా సుబ్బారెడ్డి–సునీత దంపతులను సోమవారం పూజిత పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి రూ.లక్ష నగదు, బట్టలు, పిండి వంటలు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బిడ్డలను కోల్పోయిన తల్లితండ్రుల దుఖాన్ని ఏమి ఇచ్చినా తీర్చలేమని, తాము చేసే ఆర్థిక సాయం కేవలం వారికి ధైర్యం చెప్పేందుకేనన్నారు. భగవంతుడు వారికి ఆ దుఖాన్ని తట్టుకునే మనో ధైర్యాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు. ఆమె వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు మన్నెమాల శ్రీనివాసులురెడ్డి, చెందులూరు శ్రీనివాసులు, కడివేటి చంద్రశేఖర్‌రెడ్డిŠ, గుమ్మా శ్రీనివాసులు, వేణు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement