
వైఎస్సార్‌సీపీ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు
♦ 8, 9 తేదీల్లో గుంటూరు నాగార్జున వర్సిటీ ఎదురుగా సమావేశాలు
♦ ప్లీనరీ తొలిరోజున అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్.. 10న ఫలితాలు
♦ నిర్వహణకు 18 కమిటీల నియామకం
♦ నియోజకవర్గ, జిల్లా స్థాయి ప్లీనరీలు విజయవంతం: ఉమ్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ సీపీ జాతీయ ప్లీనరీ సమావేశాలను జూలై 8, 9వతేదీల్లో భారీ ఎత్తున నిర్వహించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపా రు. నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ప్లీనరీలు విజయవంతమయ్యాయని చెప్పారు. శుక్రవా రం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యా లయంలో ఆయన మీడియాతో మాట్లా డారు. గుంటూరు, విజయవాడ మధ్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ప్లీనరీ నిర్వహ ణకు 18 కమిటీలు వేసినట్లు తెలిపారు. మొత్తం 18 తీర్మానాలు ఆమోదించనున్నట్లు చెప్పారు. జిల్లాల్లో ఆమోదించిన తీర్మానాలను క్రోడీకరించినట్లు తెలిపారు.
పాస్‌ల కోసం జిల్లా పార్టీ అధ్యక్షుడిని సంప్రదించాలి
ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు ఎలాంటి అసౌక ర్యం లేకుండా పార్కింగ్ నుంచి భోజన వసతి వరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాత్రి బస చేయడానికి కూడా ఏర్పాట్లు చేశామన్నారు. పార్టీ నియమావళి ప్రకారం అధ్యక్షుడి ఎన్నికకు 8వ తేదీన నోటిఫికేషన్ ఇస్తామన్నారు. 9న నామినేషన్ స్క్రూటినీ చేపట్టి 10న ఫలితాలను వెల్లడిస్తామన్నారు. అంబేడ్కర్, అబ్దుల్ కలాం, అల్లూరి సీతా రామరాజు, తాండ్రపాపారాయుడు తదితర ప్రముఖుల పేర్లతో ఆహ్వాన ద్వారాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
విజయవాడ, గుంటూరు కార్పొ రేషన్‌లో అలంకరణకు అనుమతి కోసం స్థాని కంగా దరఖాస్తు చేయనున్నామని తెలిపారు. ప్లీనరీ పాస్‌లు జిల్లా అధ్యక్షులకు పంపా మన్నారు. నియోజకవర్గ నాయకులు పాస్‌ల కోసం జిల్లా పార్టీ అధ్యక్షుడిని సంప్రదిం చవచ్చని తెలిపారు. ప్లీనరీ ప్రాంతంలో ప్రతి జిల్లాకు ఒక రిజిస్ట్రేషన్ కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. జాతీయ ప్లీనరీలో రాజకీయ కార్యదర్శులు, పీఏసీ, సీజీసీ, సీఈసీ సభ్యులు మొదలు గ్రామ స్థాయి నుంచి ప్రతినిధులను భాగస్వాములను చేస్తున్నట్లు ఉమ్మారెడ్డి తెలిపారు.
ఆహ్వానితులు వీరే...
సాక్షి, హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతిలో జూలై 8, 9 తేదీల్లో జరిగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలకు ప్రకటించిన అన్ని విభాగాల వారూ తప్పక హాజరుకావాలని పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఆహ్వానితులు...
పార్టీ రాజకీయ కార్యదర్శులు, రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులు , కేంద్ర పాలక మండలి (సీజీసీ) సభ్యులు, కేంద్ర కార్యనిర్వాహక మండలి(సీఈసీ) సభ్యులు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, జిల్లా, నగర పార్టీ పరిశీలకులు, అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర కార్యదర్శులు, అదనపు కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, పార్లమెంట్ పరిశీలకులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, డీసీసీబీ– డీసీఎంఎస్ మాజీ చైర్మన్లు, రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీ సభ్యులు, జిల్లా–నగర పార్టీ కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు, కార్పొరేషన్ మాజీ మేయర్లు, కార్పొరేటర్లు, కార్పొరేటర్లుగా పోటీ చేసినవారు, జెడ్‌పీటీసీలు, జెడ్‌పీటీసీలుగా పోటీ చేసినవారు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ఎంపీటీసీలుగా పోటీ చేసినవారు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కౌన్సిలర్లుగా పోటీ చేసినవారు, మార్కెట్ కమిటీల మాజీ చైర్మన్లు, మండల–మున్సిపల్ – టౌన్ – నగర డివిజన్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ జెడ్‌పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మున్సిపల్ మాజీ చైర్మన్లు, డీసీసీబీ – డీసీఎంఎస్ డైరెక్టర్లు– సింగిల్ విండో అధ్యక్షులు, దేవాలయ మాజీ చైర్మన్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, సర్పంచ్‌లు, సర్పంచ్‌గా పోటీ చేసినవారు, గ్రామ ముఖ్యులు (గ్రామం నుంచి ఈ నాలుగు హోదాలలో ఎవరో ఒకరు ఆహ్వానితులుగా ఉంటారు).