umma reddy
-
ప్రజలు తిరగబడే రోజులు దగ్గరపడ్డాయి
-
వైఎస్సార్సీపీ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు
♦ 8, 9 తేదీల్లో గుంటూరు నాగార్జున వర్సిటీ ఎదురుగా సమావేశాలు ♦ ప్లీనరీ తొలిరోజున అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్.. 10న ఫలితాలు ♦ నిర్వహణకు 18 కమిటీల నియామకం ♦ నియోజకవర్గ, జిల్లా స్థాయి ప్లీనరీలు విజయవంతం: ఉమ్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ సీపీ జాతీయ ప్లీనరీ సమావేశాలను జూలై 8, 9వతేదీల్లో భారీ ఎత్తున నిర్వహించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపా రు. నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ప్లీనరీలు విజయవంతమయ్యాయని చెప్పారు. శుక్రవా రం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యా లయంలో ఆయన మీడియాతో మాట్లా డారు. గుంటూరు, విజయవాడ మధ్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ప్లీనరీ నిర్వహ ణకు 18 కమిటీలు వేసినట్లు తెలిపారు. మొత్తం 18 తీర్మానాలు ఆమోదించనున్నట్లు చెప్పారు. జిల్లాల్లో ఆమోదించిన తీర్మానాలను క్రోడీకరించినట్లు తెలిపారు. పాస్‌ల కోసం జిల్లా పార్టీ అధ్యక్షుడిని సంప్రదించాలి ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు ఎలాంటి అసౌక ర్యం లేకుండా పార్కింగ్ నుంచి భోజన వసతి వరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాత్రి బస చేయడానికి కూడా ఏర్పాట్లు చేశామన్నారు. పార్టీ నియమావళి ప్రకారం అధ్యక్షుడి ఎన్నికకు 8వ తేదీన నోటిఫికేషన్ ఇస్తామన్నారు. 9న నామినేషన్ స్క్రూటినీ చేపట్టి 10న ఫలితాలను వెల్లడిస్తామన్నారు. అంబేడ్కర్, అబ్దుల్ కలాం, అల్లూరి సీతా రామరాజు, తాండ్రపాపారాయుడు తదితర ప్రముఖుల పేర్లతో ఆహ్వాన ద్వారాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. విజయవాడ, గుంటూరు కార్పొ రేషన్‌లో అలంకరణకు అనుమతి కోసం స్థాని కంగా దరఖాస్తు చేయనున్నామని తెలిపారు. ప్లీనరీ పాస్‌లు జిల్లా అధ్యక్షులకు పంపా మన్నారు. నియోజకవర్గ నాయకులు పాస్‌ల కోసం జిల్లా పార్టీ అధ్యక్షుడిని సంప్రదిం చవచ్చని తెలిపారు. ప్లీనరీ ప్రాంతంలో ప్రతి జిల్లాకు ఒక రిజిస్ట్రేషన్ కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. జాతీయ ప్లీనరీలో రాజకీయ కార్యదర్శులు, పీఏసీ, సీజీసీ, సీఈసీ సభ్యులు మొదలు గ్రామ స్థాయి నుంచి ప్రతినిధులను భాగస్వాములను చేస్తున్నట్లు ఉమ్మారెడ్డి తెలిపారు. ఆహ్వానితులు వీరే... సాక్షి, హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతిలో జూలై 8, 9 తేదీల్లో జరిగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలకు ప్రకటించిన అన్ని విభాగాల వారూ తప్పక హాజరుకావాలని పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఆహ్వానితులు... పార్టీ రాజకీయ కార్యదర్శులు, రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులు , కేంద్ర పాలక మండలి (సీజీసీ) సభ్యులు, కేంద్ర కార్యనిర్వాహక మండలి(సీఈసీ) సభ్యులు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, జిల్లా, నగర పార్టీ పరిశీలకులు, అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర కార్యదర్శులు, అదనపు కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, పార్లమెంట్ పరిశీలకులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, డీసీసీబీ– డీసీఎంఎస్ మాజీ చైర్మన్లు, రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీ సభ్యులు, జిల్లా–నగర పార్టీ కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు, కార్పొరేషన్ మాజీ మేయర్లు, కార్పొరేటర్లు, కార్పొరేటర్లుగా పోటీ చేసినవారు, జెడ్పీటీసీలు, జెడ్పీటీసీలుగా పోటీ చేసినవారు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ఎంపీటీసీలుగా పోటీ చేసినవారు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కౌన్సిలర్లుగా పోటీ చేసినవారు, మార్కెట్ కమిటీల మాజీ చైర్మన్లు, మండల–మున్సిపల్ – టౌన్ – నగర డివిజన్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మున్సిపల్ మాజీ చైర్మన్లు, డీసీసీబీ – డీసీఎంఎస్ డైరెక్టర్లు– సింగిల్ విండో అధ్యక్షులు, దేవాలయ మాజీ చైర్మన్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, సర్పంచ్‌లు, సర్పంచ్‌గా పోటీ చేసినవారు, గ్రామ ముఖ్యులు (గ్రామం నుంచి ఈ నాలుగు హోదాలలో ఎవరో ఒకరు ఆహ్వానితులుగా ఉంటారు). -
ప్రజా నాయకుడెలా ఉండాలో చూపారు
- ప్రజారంజక పాలన అందించారు - అందుకే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు - కొనియాడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి - వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌కు నేతల నివాళి సాక్షి, హైదరాబాద్: ‘‘ఒక ప్రజానాయకుడు, పరిపాలకుడు, ముఖ్యమంత్రి ఎలా ఉండా లో.. ఎలా పరిపాలించాలో చేసి చూపించిన మహానాయకుడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి. దేశం మొత్తానికే ఆదర్శనీయమైన ముఖ్యమంత్రిగా నిలిచిన వ్యక్తి ఆయన’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి కొనియాడారు. వైఎస్సార్ ఏడవ వర్థంతిని పురస్కరించుకుని శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మేకపాటితోపాటు పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ‘వైఎస్సార్ అమర్హ్రే, జై జగన్’ నినాదాలు మార్మోగాయి. అనంతరం మేకపాటి ప్రసంగిస్తూ.. ప్రజలు అంతకుముందెన్నడూ ఊహించని విధంగా వైఎస్ తన పాలనలో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. సమాజంలోని వారందరికీ అన్నిరకాల భద్రతను చేకూర్చేందుకు కృషిచేసిన మహనీయుడు కనుకనే ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా, చిరంజీవిగా నిలిచిపోయారన్నారు. మన బిడ్డలను ప్రభుత్వమే చదివిస్తుందనిగానీ, మన ఆరోగ్యాన్ని ప్రభుత్వమే కాపాడుతుందనిగానీ అంతకుముందు ప్రజలెన్నడూ ఊహించనైనా లేదన్నారు. ప్రజారంజకమైన పాలన అందించారు కనుకనే.. ఉభయరాష్ట్రాల్లోని తెలుగువారేగాక దేశ, విదేశాల్లోని తెలుగువారు సైతం వైఎస్‌ను స్మరించుకుంటున్నారన్నారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ.. యువకులు, విద్యార్థులు, రైతులు, మహిళలు ఇలా అన్ని వర్గాల ప్రజలూ అభివృద్ధి చెందేలా గొప్ప పరిపాలనను వైఎస్ తెలుగు రాష్ట్రాలకు అందించారన్నారు. వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలు యావత్‌దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి కొనియాడారు. తెలంగాణలోని ప్రతి పల్లెలోనూ దేవుని ఫొటో పక్కన వైఎస్ ఫొటోను పెట్టుకున్నారన్నారు. ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ తాను పెద్దమ్మ గుడికెళ్లి వైఎస్ పేరిట పూజలు చేసి బయటికొస్తుంటే నలుగురు వృద్ధులు ఎదురై.. వైఎస్ ఉండగా తమకు పింఛన్లు వచ్చేవని, కేసీఆర్ వచ్చాక వాటిని తొలగించారని భోరుమని విలపించినపుడు కలత చెందానన్నారు. ప్రతి ఇంటికీ మేలు చేసిన వ్యక్తి చరిత్రలో ఎవరైనా ఉంటే అది వైఎస్ మాత్రమేనని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్.లక్ష్మీపార్వతి అన్నారు. వైఎస్ జీవించి ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొని ఉండేది కాదన్నారు. ఆ మహానేతను జగన్‌లో చూసుకుంటూ ముందుకు నడవాలని, వైఎస్ ఆదర్శాల్ని నెరవేర్చగలిగేది జగనేనని అన్నారు. కార్యక్రమంలో జగన్ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యనేతలు వాసిరెడ్డి పద్మ, పీఎన్వీ ప్రసాద్, నల్లా సూర్యప్రకాష్ సహా పలువురు పాల్గొన్నారు. ప్రజల మనిషి వైఎస్: ఉమ్మారెడ్డి ఒక నాయకుడు మరణించినపుడు తట్టుకోలేక కొన్ని వందల మంది మృతిచెందిన సంఘటన గతంలో ఎన్నడూ జరుగలేదంటే ఎంతగా వైఎస్ ప్రజల్లో నిలిచిపోయారో అర్థమవుతోందని ఏపీ శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రజల అవసరాలు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పాలించిన నేత వైఎస్ అన్నారు. తనపై ఎన్ని ఆరోపణలొచ్చినా వెరవకుండా సీబీఐ దర్యాప్తుకైనా, మరెలాంటి విచారణకైనా సిద్ధమేనని నిలబడ్డ నేత వైఎస్ అని, ఈనాడున్న పాలకుల మాదిరిగా ఆరోపణలపై విచారణ జరక్కుండా స్టేలు తెచ్చుకునేందుకు ఏనాడూ పాకులాడలేదని అన్నారు. -
రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తా
రాజ్యసభ సభ్యునిగా ధ్రువపత్రం అందుకున్న విజయసాయిరెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాలకోసం గట్టిగా కృషి చేస్తానని వైఎస్సార్సీపీ తరఫున తొలి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వేణుం బాక విజయసాయిరెడ్డి చెప్పారు. రాజ్యసభ అంటే రాష్ట్రాలసభ కనుక రాష్ట్రానికి ప్రత్యేక హోదా మొదలు అన్ని అంశాల సాధనకోసం తన వాణిని వినిపిస్తానన్నారు. ఇటీవల ముగిసిన రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన బుధవారం అసెంబ్లీ ఇన్చార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ నుంచి తన ధ్రువపత్రాన్ని స్వీకరించారు. మండలిలో వైఎస్సార్సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్.దుర్గాప్రసాదరాజుతోపాటు పెద్దసంఖ్యలో పార్టీ నేతలు వెంటరాగా ఆయన ఉదయం 11 గంటలకు కార్యదర్శి చాంబర్‌కు వెళ్లి తాను రాజ్యసభకు ఎన్నికైనట్లు ధ్రువీకరించే పత్రాన్ని(సర్టిఫికెట్ ఆఫ్ ఎలక్షన్) తీసుకున్నారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ తరఫున ఏకైక సభ్యునిగా తాను అద్భుతాలు సాధిస్తానని ప్రగల్భాలు పలకట్లేదని, అయితే ఎక్కడా ఎలాంటి లోపాల్లేకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకోసం గట్టిగా కృషి చేస్తానన్నారు. పార్లమెంటులో విధాన నిర్ణేతల్లో ఒకనిగా కొట్టొచ్చేవిధంగా తన పాత్రను నిర్వహిస్తానన్నారు. తమ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి సూచనల మేరకు చిత్తశుద్ధితో చర్చలన్నింటిలోనూ పాల్గొంటూ ఆరేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఆశిస్తున్నానని చెప్పారు. కాగా, వైఎస్సార్సీపీ నుంచి మొట్టమొదటిగా రాజ్యసభలో ప్రవేశించడానికి తనకు అవకాశం కల్పించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి తాను తొలుత హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని విజయసాయిరెడ్డి అన్నారు. పీఏసీ సమావేశంకోసం అసెంబ్లీకి వచ్చిన చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, విజయసాయిరెడ్డిని అభినందించారు. -
రాజ్యసభకు నాలుగో అభ్యర్థి అనైతికం
అధికార పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకున్న చరిత్రే లేదు: ఉమ్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: రాజ్యసభలో ఎన్నికల్లో నాలుగో అభ్యర్థిని గెలిపించుకునేంత బలం లేకున్నా అధికారంలో ఉన్న పార్టీ ఆ స్థానానికి అభ్యర్థిని పోటీ పెట్టాలనే ఆలోచనకు రావడమే అనైతిక చర్య అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అధికార పార్టీ ఇలాంటి అనైతిక చర్యలు పాల్పడిన సందర్భాలు గతంలో ఎన్నడూ లేవన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్.దుర్గాప్రసాదరాజు తదితరులు సోమవారం సచివాలయంలో ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఉమ్మారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేవారు పార్టీ అభ్యర్థిగా గుర్తింపు కోసం ఫారమ్-ఎ, ఫారమ్-బీ పత్రాలను అందజేయాల్సిన అవసరం ఉందని.. ఆ మేరకు ఎన్నికల ప్రధానాధికారిని కలిసి ఆయా పత్రాలను అందజేశామని తెలిపారు. ఒక రాజ్యసభ సీటు గెలుచుకోగల మెజార్టీ తమ పార్టీకి ఉందని, ఎవరు ఎలాంటి అనైతిక చర్యలకు పాల్పడినా పోటీ చేస్తున్న ఒక్క సీటును వైఎస్సార్సీపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మరో సెట్ నామినేషన్ వేసిన విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి సోమవారం మరో సెట్ నామినేషన్‌ను దాఖలు చేశారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎస్.దుర్గాప్రసాద్రాజుతో కలసి అసెంబ్లీకి వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.సత్యనారాయణకు నామినేషన్‌ను అందజేశారు. తొలుత ఈ నెల 26న ఆయన రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన విషయం విదితమే. ఇలావుండగా కేంద్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి కార్యాయం నుంచి విడుదలైన ప్రకటన విజయసాయిరెడ్డి నామినేషన్ దాఖలు విషయాన్ని ధ్రువీకరించింది. -
రైల్వేజోన్ పట్టని టీడీపీ
కేంద్రంపై ఒత్తిడి తేకపోవడం శోచనీయం : ఉమ్మారెడ్డి సాక్షి, విశాఖపట్నం: కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ప్రభుత్వం విశాఖ రైల్వేజోన్ కోసం ఒత్తిడి తీసుకురాకపోవడం శోచనీయమని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. ఒడిశాలో రాజకీయ లబ్ధి కోసం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు రైల్వేజోన్ ఇవ్వకుండా అన్యాయం చేస్తోందన్నారు. రైల్వేజోన్ కోసం వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష మూడోరోజుకు చేరుకుంది. దీక్షా శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. అమర్నాథ్కు సంఘీభావం తెలపడానికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖకు వస్తారన్నారు. ఇలా ఉండగా శనివారం రాత్రి కేజీహెచ్ వైద్యులు డాక్టర్ నవీన్, డాక్టర్ విజయ్‌లు దీక్షా శిబిరానికి వచ్చి అమర్నాథ్కు వైద్య పరీక్షలు చేశారు. బీపీ 110/70, ఆక్సిజన్ 97, బ్లడ్ షుగర్ 82 మిల్లీగ్రాములు, హార్ట్‌బీట్ 111 ఉందని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
కరువు సహాయక చర్యల కోసం పోరుబాట
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో దుర్భిక్షం విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా, వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని శాసనమండలిలో ఆపార్టీ పక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెల్లడించారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితులపై నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు సహాయక చర్యలు చేపట్టకుండా నిద్ర నటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని తట్టి లేపేందుకే తాము ఆందోళన బాట పడుతున్నామన్నారు. జిల్లా కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాలు, ఎక్కడ వీలైతే అక్కడ పార్టీ శ్రేణులు ధర్నాలు చేపడతారన్నారు. ఒకట్రెండు రోజుల్లో కార్యాచరణ షెడ్యూలును ప్రకటిస్తామని, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఆందోళనలలో పాల్గొంటారన్నారు. 90 శాతం గ్రామాల్లో కరువు..: రాష్ట్రంలో మునుపెన్నడూ లేని రీతిలో ఏప్రిల్‌లోనే అత్యంత తీవ్రమైన కరువు ఏర్పడిందని, సాగు, తాగునీటి కోసం ప్రజలు కటకటలాడుతున్నారన్నారు. రాష్ట్రంలో 90 శాతం గ్రామాలు కరువు బారిన పడ్డాయన్నారు. 306 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఉపాధి హామీ నిధులను 4, 5 నెలలైనా విడుదల చేయని పరిస్థితులు దాపురించాయన్నారు. నిధులు రాబట్టడంలో వైఫల్యం : కరువు పరిస్థితులను వివరించి కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఉమ్మారెడ్డి ధ్వజమెత్తారు. కరువు నష్టాన్ని రూ.2,443 కోట్లుగా అంచనా వేసి నివేదిక పంపితే కేంద్రం ఇచ్చిన సాయం రూ.433 కోట్లేనన్నారు. కేంద్రం నుంచి ఎక్కువ సాయం ఎందుకు తెచ్చుకోలేక పోతున్నారని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. -
ప్రత్యేక హోదాపై మీనమేషాలు తగదు
ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి బాపట్ల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదాపై మీనమేషాలు మానుకోవాలని ఎమ్మెల్సీ డాక్టరు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సూచించారు. బాపట్లలోని తన నివాసంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేకహోదా సాధించుకుంటే హక్కుగా రాష్ట్రాభివృద్ధికి నిధులు తెచ్చుకోవచ్చని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీలంటే కేంద్ర ప్రభుత్వం దయాదాక్ష్యిణ్యాలపై ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు. ప్రత్యేకహోదా కోసం 18సార్లు నివేదికలను పంపినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పుకోవటం విచారకరమన్నారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న టీడీపీనే అన్నిసార్లు ప్రత్యేకహోదాపై నివేదిక పంపితే వినకపోతే సఖ్యతఉన్నాట్లా..? లేనట్లో సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. శాంతియుతంగా విజయవాడలో ప్రదర్శన చేపడితే విచక్షణరహితంగా అరెస్టు చేయించటం సరికాదన్నారు. శంకుస్థాపనకు దూరం.. పచ్చటి భూములను చదును చేసి రాజధాని నిర్మించటం ఏమేరకు భావ్యమో చంద్రబాబునాయుడు చెప్పాలని ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు. శివరామకృష్ణ కమిటీ కూడా పంటపొలాల జోలికి వెళ్లకూడదనే నివేదిక ఇచ్చిందన్నారు. ఇప్పుడు రాజ ధాని శంకుస్థాపనకు వెళ్ళితే వైఎస్సార్కాంగ్రెస్పార్టీ కూడా పచ్చటి పొలాలను నాశనం చేసుకున్నదాంట్లో భాగస్వామ్యం ఉంటుందని చెప్పారు. రాజధాని శంకుస్థాపనకు తమ పార్టీ దూరంగా ఉంటుందని తెలిపారు. 33 వేల ఎకరాలు పంటపొలాలను తీసుకోకుండా నూజివీడులో ఉన్న 50వేల ఎకరా ల అటవీభూములు తీసుకుంటే నేడు ఆహార ధాన్యాలు పండే పచ్చటి పొలాల కు ఇబ్బంది కలిగేదికాదన్నారు. ధరల స్థిరీకరణకు నిధి కేటాయించకపోవటం విచారకరం..పప్పుధాన్యాలు, ఇతర నిత్యావసర సరుకుల ధరలు వంద నుంచి 140శాతం పెరిగినప్పటికీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అదుపు చేయలేకపోతున్నాయని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. ధరల స్థిరీకరణకు వెయ్యికోట్లు కేటాయిస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు ఆ విషయాన్ని అసలు పట్టించుకోవటంలేదన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాశరరావు, నాయకులు నరాలశెట్టి కృష్ణమూర్తి, వెంకట్రావు ఉన్నారు. -
'బాబూ.. ఎందుకు ఈ నాటకాలు'
-
టీడీపీని వీడేందుకు ఎమ్మెల్యేలు సిద్ధం
వైఎస్సార్సీపీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి మేనిఫెస్టోలో 200 హామీలిచ్చారు.. ఒక్కటీ అమలు కాలేదు సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో టీడీపీ పూర్తిగా విఫలమైంది. రైతు, డ్వాక్రా, చేనేత రుణాల మాఫీతోపాటు 9 గంటల ఉచిత విద్యుత్, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి.. ఇలా మేనిఫెస్టోలో పొందుపరిచిన 200 హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదు. దీంతో జనం నిలదీస్తుండడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో జనానికి ముఖం చూపించలేక పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే తెలంగాణలో పూర్తిగా ఖాళీ అవుతోంది’’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం అనంతపురంలో జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ అధ్యక్షతన జిల్లా కమిటీలతో సమావేశం నిర్వహించారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతం కావాలన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ‘అనంత’ రైతుల శ్రేయస్సును చంద్రబాబు పూర్తిగా విస్మరించారని ఆయన విమర్శించారు. అనంతపురానికి సాగునీటి వనరుల కల్పనలోనూ పూర్తిగా నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారన్నారు. ‘‘రుణమాఫీ చేయకపోవడంతో రైతులు పంటల బీమా ప్రీమియాన్ని చెల్లించలేకపోయారు. ఉత్తరాంధ్రలో హుద్‌హుద్ తుపానుతో 4 లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. ప్రీమియం చెల్లించి ఉంటే ఒక్కొక్క రైతుకు రూ.23 వేలు చొప్పున పరిహారం వచ్చేది. బాబు పుణ్యంతో చిల్లిగవ్వ కూడా రాని పరిస్థితి తలెత్తింది’’ ’’ అని విమర్శించారు. చంద్రబాబు నిర్వాకంతో రాష్ట్రంలో డ్వాక్రా మహిళల పరిస్థితి తలకిందులైందన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన పావలావడ్డీ, వడ్డీలేని రుణాలతోపాటు కేంద్రమిచ్చే ఏడుశాతం వడ్డీ కూడా పోయిందని, ఇప్పుడు 14 శాతం వడ్డీని చెల్లించాల్సి వస్తోందన్నారు. డ్వాక్రా రుణాలు నాలుగేళ్లల్లో 20 శాతం చొప్పున చెల్లిస్తామని బాబు అంటున్నారని, అంటే అప్పటివరకు రుణగ్రస్తులుగానే వారిని ఉంచుతారా? అని ప్రశ్నించారు. చరిత్రలో హామీల్ని నిలబెట్టుకున్న ఘనత ఎన్టీఆర్, వైఎస్‌లకు మాత్రమే దక్కుతుందన్నారు. రుణమాఫీ చేయని బాబుపై నవంబర్ 5న ప్రజలంతా దండయాత్ర చేయాలని పిలుపునిచ్చారు.