లోక్ సభ ఎన్నికలకు ఒక్క ఏడాది మాత్రమే మిగిలి ఉందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలన్ని ఏకమవుతాయని ఆయా పార్టీలోని నేతల్లో భారీగా అంచనాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి ఎక్కువ అంచనాలు ఉన్నాయన్నారు. ఈ మేరకు ప్రియాంక గాంధీ చత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న కాంగ్రెస్ 85 ప్లీనరీ సెషన్‌లో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేగాదు ప్రతిపక్షాలు, ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
మన పార్టీ సందేశాన్ని ప్రభుత్వా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా పార్టీ కోసం పోరాడుతున్న పార్టీ కార్యకర్తలను ప్రియాంక ప్రశంసించారు. ఈమేరకు ఆమె కాంగ్రెస్ నాయకులను ఉద్దేశిస్తూ..మీకు బీజేపీతో పోరాడే ధైర్యం ఉందని తెలుసు. దేశం కోసం ఆ ధైర్యాన్ని ప్రదర్శించే సమయం వచ్చేసింది. మండల స్ఘాయి నుంచే కాంగ్రెస్ను బలోపేతం చేయాలని చెప్పారు. కాగా, లోక్‌సభ ఎన్నికలకు ఆ పార్టీ తమ నేతలకు దిశా నిర్దేశం చేసి కార్యాచరణ రూపొందించనట్లు తెలుస్తోంది.
(చదవండి: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు.. ‘ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం)
Comments
Please login to add a commentAdd a comment