
ప్లీనరీ ఏర్పాట్లు షురూ..
టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.
కుత్బుల్లాపూర్: టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం కొంపల్లి జీబీఆర్ గార్డెన్‌లో కొనసాగుతున్న పనులను స్వయంగా పరిశీలించారు. భోజనం, పార్కింగ్, వీఐపీ విడిది, వివిధ జిల్లాల నుంచి వచ్చే నాయకులు, కార్యకర్తలకు వసతి ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పరిపాలనా పరంగా కేసీఆర్ దేశంలోనే నెంబర్ వన్ సీఎంగా అభివర్ణించారు. తెలంగాణ ఇతర రాష్ట్రాల కంటే అబ్బుర పడే విధంగా 21 శాతం వృద్ధి రేటుతో దూసుకు పోతుందన్నారు. 21న జరుగుతున్న ప్లీనరీని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ఇందుకుగాను 60 ఎకరాల్లో ఏర్పాట్లు చేశామని, ప్రధాన సభా ప్రాంగణం ఐదున్నర ఎకరాలు ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీలు మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్‌రాజు, మైనంపల్లి, కర్నె ప్రభాకర్, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్ బాల మల్లు, ఎమ్మెల్యేలు కృష్ణారావు, వివేకానంద్ ఉన్నారు.