వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాల్లో పుట్టి పోరాటాల్లో పెరిగిందని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చెప్పారు. జగన్మోహన రెడ్డి నాయకత్వంలో పోరాడి సమైక్య రాష్ట్రాన్ని నిలుపుకుందామన్నారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ఈ ఉదయం వైఎస్‌ఆర్ సీపీ 2వ ప్లీనరీలో ఆమె ప్రారంభోపన్యాసం ఇచ్చారు.