టీఆర్‌ఎస్ నేతలకు మాజీ చీఫ్ విప్ గండ్ర సూచన
హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్లీనరీని ఆత్మపరిశీలన వేదికగా చేసుకోవాలని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రజలకిచ్చిన హామీలేమిటి, అందులో ఎన్ని అమలయ్యాయో పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు.
ప్లీనరీలో నేతలతో కాకుండా సామాన్య కార్యక ర్తలతో మాట్లాడిస్తే వాస్తవ పరిస్థితులు వెల్లడవుతాయన్నారు. గ్రామాల్లో తీవ్ర కరువు పరిస్థితులు, రైతుల ఆత్మహత్యల వంటి వాస్తవాలు తెలుస్తాయన్నారు.
ప్లీనరీని ఆత్మపరిశీలన వేదికగా చేసుకోవాలి
Published Thu, Apr 23 2015 1:35 AM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM
Advertisement
Advertisement