నరేంద్రమోదీ ప్రభుత్వ విధానాలపై మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మండిపడ్డారు. ఎన్నికల్లో మోదీ ఇచ్చిన రెండుకోట్ల ఉద్యోగాల హామీ వట్టి అభూత కల్పనగా మారిందని విరుచుకుపడ్డారు. ‘మోదీజీ ఎన్నికల ప్రచారంలో ఎన్నో పెద్దపెద్ద హామీలు ఇచ్చారు. అందులో ఒక్కటీ కూడా నెరవేర్చలేదు. ఆయన రెండుకోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.