వైఎస్సార్‌సీపీ ప్లీనరీకి తరలిరావాలి | The activists should move heavily to YSRCPP plenary | Sakshi

వైఎస్సార్‌సీపీ ప్లీనరీకి తరలిరావాలి

Jun 10 2017 3:36 AM | Updated on May 29 2018 4:37 PM

వైఎస్సార్‌సీపీ ప్లీనరీకి తరలిరావాలి - Sakshi

వైఎస్సార్‌సీపీ ప్లీనరీకి తరలిరావాలి

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈనెల మూడో వారంలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్లీనరీకి కార్య కర్తలు భారీగా తరలిరావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్‌ రాజ్‌ అన్నారు.

పార్టీ జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్‌రాజ్‌
జనగామ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈనెల మూడో వారంలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్లీనరీకి కార్య కర్తలు భారీగా తరలిరావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్‌ రాజ్‌ అన్నారు. పట్టణంలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు చిన్నపాగ వెంకటరత్నం అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పా ల్గొని మాట్లాడారు. ప్లీనరీకి వైఎస్సా ర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హా జరుకానున్నట్లు చెప్పారు. ప్లీనరీలో టీఆర్‌ఎస్‌ పార్టీ వైఫల్యాలు, ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతామన్నారు.

తెలంగాణ ప్రభుత్వం మూడెకరాల భూపంపిణీ విషయంలో వైఫల్యంతో పాటు లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి కేవలం వందల సం ఖ్యలో భర్తీచేయడం దారుణమన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టిస్తామని చెప్పి మోసం చేస్తుందని మండిపడ్డారు. రానున్న రోజుల్లో వైఎస్సార్‌సీపీకి తెలంగాణలో మంచి భవిష్యత్‌ ఉం టుందని చెప్పారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, కందికొండ భిక్షపతి, జిల్లా సంయుక్త కార్యదర్శి ఐలయ్య, ఎస్సీ, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షులు రొడ్డ కృష్ణ, చింతకింది శ్రీహ రి,  మండల అధ్యక్షుడు బక్క జంపన్న, నాయకులు ఊరిడి శ్రీనివాస్, దేవరాయ ఆంజనేయులు, రడపాక భాస్కర్,  జంగిశేఖర్, బొట్ల నవీన్, గుండె శ్రీకాంత్, దారావత్‌ నరేష్, కల్లెపు ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement