
సాక్షి, న్యూఢిల్లీ : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్లీనరీ తేదీలు ఖరారయ్యాయి. మార్చి 16 నుంచి 18 వరకు ఢిల్లీలో జాతీయ ప్లీనం జరుగుతుందని ఆ పార్టీ వర్గాలు శనివారం ఒక ప్రకటన చేశాయి. జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికకు ఆమోదం తెలపడం, నూతన వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ఏర్పాటు లాంటి తీర్మానాలను ప్రతినిధులు ఆమోదించనున్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న కాంగ్రెస్ ఈ సమావేశాలను కీలకంగా భావిస్తున్నది. కాగా, ప్లీనరీ నిర్వహణ కోసం 34 మంది సభ్యులతో ఏర్పాటయిన స్టీరింగ్ కమిటీలో తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం దక్కకపోవడం గమనార్హం.