కాన్పూర్: టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో 20 ఓవర్లలో దక్షిణాఫ్రికా జట్టు ఒక్క వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. 10 ఓవర్ల తర్వాత ఆ జట్టు నిలకడగా ఆడుతోంది. ఓపెనర్ ఆమ్లా 33 పరుగులు (50 బంతులు, 3 ఫోర్లు) డుప్లెసిస్ 29 (37 బంతులు, 3 ఫోర్లు) పరుగులతో క్రీజులో ఉన్నారు. మరో ఓపెనర్ డికాక్(29) ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన వన్డౌన్ బ్యాట్స్మన్ డుప్లెసిస్ దూకుడుగా ఆడుతూ, వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తున్నాడు.
రెండో వికెట్కు ప్రస్తుతం వీరిద్దరి మధ్య 50 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఆమ్లా మాత్రం ఆరంభం నుంచి ఆచితూచి ఆడుతున్నాడు. స్ట్రైక్ రొటేట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. భారత బౌలర్లలో అశ్విన్ ఒక్క వికెట్ తీశాడు. మిగతా బౌలర్లు అంతగా రాణించలేకపోతున్నారు. కెప్టెన్ ధోనీ బౌలర్లను మార్చుతున్నప్పటికీ ఫలితాన్నివ్వకపోవడంతో సఫారీలు నింపాదిగా ఆడుతున్నారు.
నిలకడగా ఆడుతున్న దక్షిణాఫ్రికా
Published Sun, Oct 11 2015 10:28 AM | Last Updated on Sun, Sep 3 2017 10:47 AM
Advertisement