దుల్కర్‌ సల్మాన్‌ మూవీ వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే! | Dulquer Salmaan's Lucky Baskhar Release Postponed; Here Release Date | Sakshi
Sakshi News home page

Dulquer Salmaan: లక్కీ భాస్కర్‌ వాయిదా.. మీనాక్షి చౌదరి డబుల్‌ ట్రీట్‌!

Aug 20 2024 6:31 PM | Updated on Aug 20 2024 8:08 PM

Dulquer Salmaan Lucky Baskhar Movie Release Postponed this Date

సీతారామం మూవీతో టాలీవుడ్‌లో క్రేజ్‌ దక్కించుకున్న మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌. ప్రస్తుతం ఆయన హీరోగా లక్కీ భాస్కర్‌ చిత్రంలో నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా.. ఇప్పటికే వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్‌ 7న ఈ మూవీని రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

తాజాగా లక్కీ భాస్కర్‌ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అభిమానులకు మంచి క్వాలిటీతో సినిమాను అందించాలనే ఉద్దేశంతో పోస్ట్‌పోన్‌ చేస్తున్నామని వెల్లడించారు. ద్విభాషా చిత్రంగా రూపొందిస్తున్నప్పటికీ పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నామని తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా పోస్టర్‌ను పంచుకున్నారు. దీపావళి సందర్భంగా అక్టోబర్‌ 31న లక్కీ భాస్కర్‌ సందడి చేయనున్నట్లు పోస్ట్ చేశారు. కాగా.. 1980-90 కాలంలో ఓ బ్యాంక్‌ క్యాషియర్‌ అసాధారణస్థాయికి ఎలా ఎదిగాడనే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

అయితే అక్టోబర్‌ 31న మరో యంగ్ హీరో సినిమా రిలీజ్‌ కానుంది. మాస్‌కా దాస్‌ విశ్వక్‌సేన్‌ హీరోగా నటిస్తోన్న మెకానిక్ రాకీ అదే రోజు విడుదలవుతోంది. ఈ చిత్రంలోనూ హీరోయిన్ మీనాక్షి చౌదరి కావడం మరో విశేషం. దీంతో ఓకే రోజు రెండు సినిమాలతో అభిమానులను అలరించేందుకు గుంటూరు కారం భామ సిద్ధమైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement