సాక్షి, అమరావతి: ప్రభుత్వం గ్రూప్–2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేసింది. జనవరి 5న నిర్వహించాల్సిన పరీక్షను 2025 ఫిబ్రవరి 23న నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తెలిపింది. పూర్తి వివరాలు కమిషన్ వెబ్‌సైట్‌లో చూడాలని పేర్కొంది.
అక్షరాస్యత కమిటీ ఏర్పాటు
సాక్షి, అమరావతి: వయోజన విద్యకు ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర అక్షరాస్యత కేంద్రానికి ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈమేరకు పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులిచ్చారు. పాఠశాల విద్య కార్యదర్శి చైర్మన్‌గాను, ఏపీ లిటరసీ మిషన్ అథారిటీ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. మెడికల్ అండ్ ఫ్యామిలీ సంక్షేమ శాఖ, మున్సిపల్ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, స్కిల్ డెవలప్‌మెంట్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శులు, ప్రభుత్వ ఐటీ కార్యదర్శి, పాఠశాల విద్య కమిషనర్, ఐటీ సెల్ డైరెక్టర్‌తో పాటు ఇండియన్ పోస్టల్ సర్వీస్ రిటైర్డ్ అధికారి సభ్యులుగా ఉంటారు.
ట్రిపుల్ ఐటీలో 14న జాతీయ సదస్సు
నూజివీడు: జాతీయ మెటలర్జీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 14న ఏలూరు జిల్లా, నూజివీడు ట్రిపుల్ ఐటీలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ మంగళవారం తెలిపారు. జాతీయ సదస్సు పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. లోహ పదార్థాలు, వాటి ప్రాసెసింగ్‌లపై పరిశోధన చేసి, దేశానికి వెన్నుదన్నుగా నిలిచే శాస్త్రవేత్తల సేవలను గుర్తిస్తూ మెటలర్జీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment