Group-2 mains
-
గ్రూప్–2 మెయిన్స్ వాయిదా
సాక్షి, అమరావతి: ప్రభుత్వం గ్రూప్–2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేసింది. జనవరి 5న నిర్వహించాల్సిన పరీక్షను 2025 ఫిబ్రవరి 23న నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తెలిపింది. పూర్తి వివరాలు కమిషన్ వెబ్సైట్లో చూడాలని పేర్కొంది. అక్షరాస్యత కమిటీ ఏర్పాటుసాక్షి, అమరావతి: వయోజన విద్యకు ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర అక్షరాస్యత కేంద్రానికి ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈమేరకు పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులిచ్చారు. పాఠశాల విద్య కార్యదర్శి చైర్మన్‌గాను, ఏపీ లిటరసీ మిషన్ అథారిటీ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. మెడికల్ అండ్ ఫ్యామిలీ సంక్షేమ శాఖ, మున్సిపల్ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, స్కిల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శులు, ప్రభుత్వ ఐటీ కార్యదర్శి, పాఠశాల విద్య కమిషనర్, ఐటీ సెల్ డైరెక్టర్‌తో పాటు ఇండియన్ పోస్టల్ సర్వీస్ రిటైర్డ్ అధికారి సభ్యులుగా ఉంటారు.ట్రిపుల్ ఐటీలో 14న జాతీయ సదస్సునూజివీడు: జాతీయ మెటలర్జీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 14న ఏలూరు జిల్లా, నూజివీడు ట్రిపుల్ ఐటీలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ మంగళవారం తెలిపారు. జాతీయ సదస్సు పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. లోహ పదార్థాలు, వాటి ప్రాసెసింగ్‌లపై పరిశోధన చేసి, దేశానికి వెన్నుదన్నుగా నిలిచే శాస్త్రవేత్తల సేవలను గుర్తిస్తూ మెటలర్జీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
జూలై 28న గ్రూప్–2 మెయిన్స్
సాక్షి, అమరావతి: గ్రూప్–2 మెయిన్ పరీక్షలను జూలై 28వ తేదీన ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి అభ్యర్థులు ఈ నెల 5 నుంచి 18వ తేదీ వరకు పరీక్ష కేంద్రంతోపాటు తమ పోస్టు, జోనల్/జిల్లా ప్రాధాన్యతను సమర్పించాలని సర్వీస్ కమిషన్ సూచించింది. జూలై 28వ తేదీ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో ఆఫ్‌లైన్‌లో పరీక్ష ఉంటుందని ప్రకటించింది. ఈసారి మెయిన్స్ పరీక్షకు 92,250 మంది హాజరుకానున్నారు. ఏపీపీఎస్సీ 899 గ్రూప్–2 పోస్టుల భర్తీ కోసం గత ఏడాది డిసెంబర్ 7న నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.పరీక్ష నిర్వహించిన 45 రోజుల రికార్డు వ్యవధిలో ఏప్రిల్ 10న ప్రిలిమ్స్ ఫలితాలను కూడా వెల్లడించింది. గతానికి భిన్నంగా ఎక్కువ మంది నిరుద్యోగులకు మేలు చేసేందుకు మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. చివరిగా 2018లో నిర్వహించిన గ్రూప్–2 ప్రిలిమ్స్ రాసినవారి నుంచి 1:12 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. అయితే, నిరుద్యోగుల నుంచి ఏపీపీఎస్సీకి అందిన విజ్ఞప్తుల మేరకు ఎక్కువ మందికి మెయిన్స్ రాసేందుకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఒక పోస్టుకు 100 మంది చొప్పున ఎంపిక చేశారు. గ్రూప్ పరీక్షలకు 1:100 విధానంలో ఎంపిక చేయడం సర్వీస్ కమిషన్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో 899 పోస్టులకు గాను 92,250 మంది మెయిన్స్ రాయనున్నారు.ఇవీ పోస్టుల వివరాలు... ఏపీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్–2 నోటిఫికేషన్లో 114 డిప్యూటీ తహసీల్దార్, 150 ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, గ్రేడ్–3 మున్సిపల్ కమిషనర్ పోస్టులు 4, గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్ 16, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 28 పోస్టులతోపాటు 59 శాఖల్లో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉండగా, నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఏవో), సీనియర్ ఆడిటర్, ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్స్, వివిధ సెక్షన్లలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 566 ఉన్నాయి. ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే మెయిన్స్ పరీక్షలో పేపర్–1, పేపర్–2లకు 150 మార్కులకు 150 చొప్పున ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు తమ పరీక్ష సెంటర్, ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్యత, జోనల్/జిల్లా ప్రాధాన్యతలకు కమిషన్ వెబ్సైట్ http:// www.psc.ap.gov.in లో బుధవారం నుంచి నమోదు చేయాలి. -
గ్రూప్–2 మెయిన్స్ రివైజ్డ్ కీ విడుదల
సాక్షి, అమరావతి: గ్రూప్–2 మెయిన్స్ (కంప్యూటర్ ఆధారిత) పరీక్షకు సంబంధించిన రివైజ్డ్ కీని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) శుక్రవారం రాత్రి విడుదల చేసింది. గ్రూప్– 2 కేడర్‌కు సంబంధించిన 982 పోస్టుల భర్తీకి జూలై 15, 16 తేదీల్లో మూడు పేపర్ల మెయిన్స్ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలను కమిషన్ పేపర్ల వారీగా విడుదల చేసింది. వీటిని వెబ్సైట్ (https:// www. psc.ap.gov.in)లో పొందుపరిచింది. -
ఏపీ గ్రూప్–2 మెయిన్స్‌లో కాపీ కొట్టేశారు..
♦ నిబంధనలకు విరుద్ధంగా సెల్ఫోన్లు, పెన్ కెమెరాల అనుమతి ♦ ఆన్సర్లు తెప్పించుకొని దర్జాగా రాసుకున్న అభ్యర్థులు ♦ చీరాల, ఒంగోలు ప్రాంతాల్లో జోరుగా మాస్ కాపీయింగ్ ♦ ఏపీపీఎస్సీ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదుల వెల్లువ ♦ సీసీ ఫుటేజ్‌లు పరిశీలించాలని వినతి ఏపీపీఎస్సీ గ్రూప్–2 పరీక్షలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈనెల 15, 16 తేదీల్లో ఆన్లైన్లో నిర్వహించిన మెయిన్స్‌లో భారీగా అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్లు కాదు కదా కనీసం పెన్ను కూడా అనుమతించలేదని నిర్వాహకులు చెప్పినప్పటికీ కొన్ని సెంటర్లలో మాస్ కాపీయింగ్ జరిగినట్టు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒంగోలు: పది రోజుల క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్–2 మెయిన్స్ ఆన్లైన్ పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సెంటర్లలో అభ్యర్థులు జోరుగా కాపీయింగ్‌కు పాల్పడ్డారని ఏపీపీఎస్సీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని పలు సెంటర్లలో ఈ కాపీయింగ్ యథేచ్ఛగా సాగిందని, ముఖ్యంగా జిల్లాలోని చీరాల, ఒంగోలు ప్రాంతాల్లోని సెంటర్లలో కాపీయింగ్ జరిగిందని పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు. కొన్ని కాలేజీల్లో నిబంధనలకు విరుద్ధంగా పెన్ కెమెరాలు, సెల్ఫోన్లు అనుమతిచ్చారని, తద్వారా ప్రశ్న పత్రాలు బయటకు పంపి కొందరు అభ్యర్థులు అన్సర్లు తెప్పించుకొని అక్రమాలకు పాల్పడ్డారని ఆ ఫిర్యాదుల్లో వివరించారు. కాపీయింగ్ వల్లే అధిక మార్కులు.. ప్రకాశం జిల్లాలో చీరాల, ఒంగోలుతో పాటు పలు సెంటర్లలో ఈ అక్రమాలు పెద్ద ఎత్తున సాగినట్లు కొందరు అభ్యర్థులు ‘సాక్షి’కి వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని కాలేజీల్లో పెన్ కెమెరాలు, మరికొన్ని కాలేజీల్లో సెల్ఫోన్లు అనుమతించినట్లు వారు పేర్కొన్నారు. పరీక్ష అయిన మరుసటి రోజు ఏపీపీఎస్సీ ‘కీ’ విడుదల చేయగా జిల్లావ్యాప్తంగా అన్ని సెంటర్లలోనూ 230 నుంచి 260 మార్కులు రాగా.. చీరాలకు చెందిన సెంటర్లో మాత్రం 320 నుంచి 336 వరకు మార్కులొచ్చాయన్నారు. ఇది కాపీయింగ్ వల్లే సాధ్యమైనదనేది ఫిర్యాదు చేసిన అభ్యర్థుల వాదన. సీసీ ఫుటేజిలు అభ్యర్థులే తెచ్చివ్వాలట.. తమ ఫిర్యాదులకు ఏపీపీఎస్సీ స్పందించటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఎగ్జామ్ సెంటర్లలోని సీసీ ఫుటేజ్‌లను పరిశీలించాలని కొందరు అభ్యర్థులు ఏపీపీఎస్సీ హెల్ప్‌లైన్‌కు పాటు రాతపూర్వకంగా ఫిర్యాదులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సమాధానంగా ఏపీపీఎస్సీ అధికారులు ఫిర్యాదుతో పాటు సదరు సెంటర్లకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌లు మీరే తెచ్చి ఇవ్వాలంటూ అభ్యర్థులకు చెప్పినట్లు కొందరు అభ్యర్థులు పేర్కొంటున్నారు. అభ్యర్థులకు ఎగ్జామ్ సెంటర్లు నిర్వహించిన కళాశాలలు సీసీ ఫుటేజ్‌లు ఎలా ఇస్తాయని వారు ప్రశ్నిస్తున్నారు. అక్రమాలు జరిగాయని ఏపీపీఎస్సీకి వివరాలు అందించినా.. స్పందించటం లేదని వారు వాపోతున్నారు. సెంటర్లలోని సీసీ ఫుటేజ్‌లు ఇప్పటికే ఏపీపీఎస్సీ వద్ద ఉన్నాయని వాటిని పరిశీలిస్తే అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. కొన్ని కళాశాలలు, రాష్ట్రస్థాయిలో పెద్దలు ఒత్తిడి వల్లే ఏపీపీఎస్సీ అక్రమాలను పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నత స్థాయి ఉద్యోగాలకు పకడ్బందీగా పరీక్ష నిర్వహించాల్సి ఉన్నా ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదని, కనీసం ఆరోపణలు వచ్చినప్పుడైనా విచారణ జరపాల్సిన ఏపీపీఎస్సీ ఏ మాత్రం పట్టించుకోకపోవడంపై అభ్యర్థుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కాపీ కొట్టేశారు
►గ్రూప్–2 మెయిన్స్‌లో మాస్ కాపీయింగ్ ►జిల్లాలోని పలు సెంటర్లలో అక్రమాలు ►నిబంధనలకు విరుద్ధంగా సెల్ఫోన్లు, పెన్ కెమెరాల అనుమతి ►ప్రశ్నలు బయటకు లీక్ ►ఆన్సర్లు తెప్పించుకొని దర్జాగా రాసుకున్న అభ్యర్థులు ►చీరాల, ఒంగోలు ప్రాంతాల్లోజోరుగా మాస్ కాపీయింగ్ ►ఏపీపీఎస్సీ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదుల వెల్లువ ►సీసీ ఫుటేజ్‌లు పరిశీలించాలని వినతి ►అయినా పట్టించుకోని అధికారులు ఏపీపీఎస్సీ గ్రూప్–2 పరీక్షలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈనెల 15, 16 తేదీల్లో ఆన్లైన్లో నిర్వహించిన మెయిన్స్‌లో భారీగా అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్లు కాదు కదా కనీసం పెన్ను కూడా అనుమతించలేదని నిర్వాహకులు చెప్పినప్పటికీ కొన్ని సెంటర్లలో మాస్ కాపీయింగ్ జరిగినట్టు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒంగోలు : పది రోజుల క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్–2 మెయిన్స్ ఆన్లైన్ పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సెంటర్లలో అభ్యర్థులు జోరుగా కాపీయింగ్‌కు పాల్పడ్డారని ఏపీపీఎస్సీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని పలు సెంటర్లలో ఈ కాపీయింగ్ యథేచ్ఛగా సాగిందని, ముఖ్యంగా జిల్లాలోని చీరాల, ఒంగోలు ప్రాంతాల్లోని సెంటర్లలో కాపీయింగ్ జరిగిందని పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు. కొన్ని కాలేజీల్లో నిబంధనలకు విరుద్ధంగా పెన్ కెమెరాలు, సెల్ఫోన్లు అనుమతిచ్చారని, తద్వారా ప్రశ్న పత్రాలు బయటకు పంపి కొందరు అభ్యర్థులు అన్సర్లు తెప్పించుకొని అక్రమాలకు పాల్పడ్డారని ఆ ఫిర్యాదుల్లో వివరించారు. కాపీయింగ్ వల్లే అధిక మార్కులు.. ప్రకాశం జిల్లాలో చీరాల, ఒంగోలుతో పాటు పలు సెంటర్లలో ఈ అక్రమాలు పెద్ద ఎత్తున సాగినట్లు కొందరు అభ్యర్థులు ‘సాక్షి’కి వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని కాలేజీల్లో పెన్ కెమెరాలు, మరికొన్ని కాలేజీల్లో సెల్ఫోన్లు అనుమతించినట్లు వారు పేర్కొన్నారు. పరీక్ష అయిన మరుసటి రోజు ఏపీపీఎస్సీ ‘కీ’ విడుదల చేయగా జిల్లావ్యాప్తంగా అన్ని సెంటర్లలోనూ 230 నుంచి 260 మార్కులు రాగా.. చీరాలకు చెందిన సెంటర్లో మాత్రం 320 నుంచి 336 వరకు మార్కులొచ్చాయన్నారు. ఇది కాపీయింగ్ వల్లే సాధ్యమైనదనేది ఫిర్యాదు చేసిన అభ్యర్థుల వాదన. సీసీ ఫుటేజిలు అభ్యర్థులే తెచ్చివ్వాలట.. తమ ఫిర్యాదులకు ఏపీపీఎస్సీ స్పందించటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఎగ్జామ్ సెంటర్లలోని సీసీ ఫుటేజ్‌లను పరిశీలించాలని కొందరు అభ్యర్థులు ఏపీపీఎస్సీ హెల్ప్‌లైన్‌కు పాటు రాతపూర్వకంగా ఫిర్యాదులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సమాధానంగా ఏపీపీఎస్సీ అధికారులు ఫిర్యాదుతో పాటు సదరు సెంటర్లకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌లు మీరే తెచ్చి ఇవ్వాలంటూ అభ్యర్థులకు చెప్పినట్లు కొందరు అభ్యర్థులు పేర్కొంటున్నారు. అభ్యర్థులకు ఎగ్జామ్ సెంటర్లు నిర్వహించిన కళాశాలలు సీసీ ఫుటేజ్‌లు ఎలా ఇస్తాయని వారు ప్రశ్నిస్తున్నారు. అక్రమాలు జరిగాయని ఏపీపీఎస్సీకి వివరాలు అందించినా.. స్పందించటం లేదని వారు వాపోతున్నారు. సెంటర్లలోని సీసీ ఫుటేజ్‌లు ఇప్పటికే ఏపీపీఎస్సీ వద్ద ఉన్నాయని వాటిని పరిశీలిస్తే అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. కొన్ని కళాశాలలు, రాష్ట్రస్థాయిలో పెద్దలు ఒత్తిడి వల్లే ఏపీపీఎస్సీ అక్రమాలను పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నత స్థాయి ఉద్యోగాలకు పకడ్బందీగా పరీక్ష నిర్వహించాల్సి ఉన్నా ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదని, కనీసం ఆరోపణలు వచ్చినప్పుడైనా విచారణ జరపాల్సిన ఏపీపీఎస్సీ ఏ మాత్రం పట్టించుకోకపోవడంపై అభ్యర్థుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
గ్రూప్–2 మెయిన్స్ ప్రశ్నలు లీక్!
- సోషల్ మీడియాలో కలకలం రేపుతున్న స్క్రీన్‌షాట్స్ - అవి ఫేక్ స్క్రీన్‌షాట్స్.. దుష్ప్రచారాన్ని నమ్మవద్దు: ఏపీపీఎస్సీ సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) గత వారం నిర్వహించిన గ్రూప్–2 మెయిన్స్ ఆన్లైన్ పరీక్షపై వివాదం నెలకొంది. ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షకు సంబంధించిన కొన్ని స్క్రీన్‌షాట్స్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుండడంతో కలకలం రేగుతోంది. పేపర్ లీకైందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్, రాయలసీమ,కోస్తా కేంద్రాల్లో అక్రమాలు గ్రూప్–2 మెయిన్స్‌ను మూడు పేపర్లతో నిర్వహించారు.తొలిరోజు విశాఖపట్నంతో సహా మరికొన్ని కేంద్రాల్లో సాంకేతిక కారణాలతో పరీక్ష ఆలస్యంగా ప్రారంభమైంది. మరికొన్ని కేంద్రాల్లో పరీక్ష మధ్యలోనే నిలిచిపోయింది. విశాఖపట్నం గీతం వర్సిటీ కేంద్రంలో పరీక్ష ఆగిపోయి, తిరిగి ఎంతసేపటికీ ప్రారంభం కాకపోవడంతో అభ్యర్థులు బయటకు వచ్చి ఆందోళనకు దిగారు. పరీక్ష మళ్లీ ప్రారంభమయ్యాక కొందరు హాజరై పరీక్ష రాశారు. కొన్ని కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా స్క్రీన్షాట్లు తీసి, ప్రశ్నలను బయటకు పంపి సమాధానాలు రప్పించి, ఎంపిక చేసిన అభ్యర్థులతో రాయించారని కొందరు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లోని కేంద్రాల్లో అక్రమాలు జరిగాయంటున్నారు. గ్రూప్–2 మెయిన్స్‌ను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫిర్యాదు చేస్తే విచారణ జరిపిస్తాం.. గ్రూప్–2 పరీక్ష ప్రశ్నల స్క్రీన్షాట్లు ఏ కేంద్రంలో తీశారో తమకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ చెప్పారు. మొదటి రోజు కొన్ని కేంద్రాల్లో సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు తలెత్తాయన్నారు. విశాఖ గీతం వర్సిటీ కేంద్రంలో పరీక్ష మధ్యలో నుంచి వెళ్లిపోయిన వారిని గైర్హాజరు జాబితాలో చేర్చామని వెల్లడించారు. ప్రచారంలోకి వచ్చిన ప్రశ్నల స్క్రీన్షాట్లు ఫేక్ కావొచ్చని అన్నారు. పుకార్లు వ్యాపింపజేస్తున్న వారిపై చర్యలు స్క్రీన్షాట్ల అంశంపై ఏపీపీఎస్సీ తన వెబ్‌సైట్‌పై ఆదివారం ఒక ప్రకటన జారీ చేసింది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న గ్రూప్–2 పరీక్ష ప్రశ్నల స్క్రీన్షాట్లు ఫేక్ అని, దుష్ప్రచారాన్ని నమ్మవద్దని పేర్కొంది. పుకార్లు వ్యాపింపజేస్తున్న వారిని కనిపెట్టి, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. -
నేడు, రేపు గ్రూప్–2 మెయిన్స్
- 171 కేంద్రాలు ఏర్పాటు చేసిన ఏపీపీఎస్సీ - 1,000 మంది అభ్యర్థులు పరీక్షకు దూరం సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 982 గ్రూప్–2 పోస్టుల భర్తీకి మెయిన్స్ పరీక్ష శని, ఆదివారాల్లో జరగనుంది.ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి వైవీఎస్టీ సాయి శుక్రవారం తెలిపారు. శనివారం మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీలోని 13 జిల్లాలు, హైదరాబాద్‌లో మొత్తం కలిపి 171 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 49,106 మంది హాజరు కానున్నారు. కటాఫ్ ప్రకారం అర్హత మార్కులు వచ్చిన వారిలో 1,000 మందికి ఈ పరీక్ష రాసేందుకు అవకాశం దక్కడ లేదు. గ్రూప్–2 స్క్రీనింగ్ లో 1:50 నిష్పత్తిలో కటాఫ్ నిర్ణయించి మెయిన్స్‌కు ఎంపిక చేశారు.కటాఫ్‌లో అనేక మందికి సమాన మార్కులొచ్చాయి. వీరిలో వయసు ఎక్కువ ఉన్న వారికే అవకాశం కల్పించి తక్కిన వారిని ఏపీపీఎస్సీ తిరస్కరించింది. తమకూ పరీక్షకు అనుమతించాలని ఈ 1,000 మందీ మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. -
గ్రూప్–2 మెయిన్స్ వాయిదా వేయలేం
ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ స్పష్టం సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 982 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి సంబంధించి గతేడాది విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారమే నిర్ణీత తేదీల్లో మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ స్పష్టం చేశారు. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలను ఈనెల 4న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలను మార్చి 20న ప్రకటిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారని, దాదాపు 15 రోజులు ఆలస్యమైనందున ఆ మేరకు మెయిన్స్ పరీక్షల తేదీలను పొడిగించాలని అభ్యర్థులు కోరుతున్నారు. మెయిన్స్‌కు ప్రిపేర్ అయ్యేందుకు తగినంత సమయమివ్వాలని అభ్యర్థిస్తున్నారు. ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లింది. ఆయన మాట్లాడుతూ.. ప్రిలిమ్స్ ఫలితాల విడుదల ఆలస్యమైనా, దీనికి సంబంధించిన ‘కీ’లను ముందుగానే వెబ్సైట్లో పెట్టామన్నారు. తద్వారా ఎన్ని మార్కులు వస్తాయో అభ్యర్థులు ఒక అంచనాకు వచ్చేందుకు అవకాశముందని చెప్పారు. దాని ప్రకారమే మెయిన్స్‌కు ప్రిపేరై ఉండొచ్చన్నారు. కొన్ని కోచింగ్ సెంటర్ల వారే మెయిన్స్‌కు మరింత సమయం కావాలన్న వాదనను తెరపైకి తెచ్చారని.. ఇలాంటి వాటిని తాము అనుమతించబోమని స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారమే మే 20, 21 తేదీల్లోనే మెయిన్స్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇదిలాఉండగా, సుప్రీంకోర్టు తీర్పు మేరకు 1999 గ్రూప్ 2కు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇటీవల మెరిట్ జాబితా విడుదల చేసినా.. ఇందులో రీలింక్విషన్(రద్దు) లేఖలు ఇచ్చిన వారి స్థానాల్లో ఎంపికలు నిర్వహించాల్సి ఉందని ఉదయభాస్కర్ చెప్పారు. ఇది పూర్తయిన తర్వాతే ఎగ్జిక్యూటివ్ పోస్టుల జాబితాను ప్రభుత్వానికి అందిస్తామన్నారు. ఇదే గ్రూప్ 2కి సంబంధించిన నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల జాబితాను వారం పది రోజుల్లో వెల్లడిస్తామని ప్రకటించారు. వీటికి ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి సంబంధం లేదని వివరించారు.