పారిస్: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వాయిదా పడుతున్న మెగా ఈవెంట్స్‌లో మరొకటి చేరింది. ప్రతి యేటా జరిగే ప్రతిష్టాత్మక సైక్లింగ్ రేసు ‘టూర్ డి ఫ్రాన్స్’ వాయిదా పడింది. 117 ఏళ్ల చరిత్ర ఉన్న ‘టూర్ డి ఫ్రాన్స్’ రేసుకు షెడ్యూల్ ప్రకారం జూన్ 27 నుంచి జూలై 19 వరకు ఫ్రాన్స్‌లోని నైస్ నగరం ఆతిథ్యమివ్వాల్సింది. అయితే ఫ్రాన్స్ ప్రభుత్వం జూలై మూడో వారం వరకు బహిరంగ ప్రదేశాల్లో ప్రజలెవరూ గుమిగూడవద్దని బుధవారం ఆదేశాలు జారీ చేసింది. దాంతో నిర్వాహకులు ఈ రేసును వాయిదా వేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 20 వరకు ‘టూర్ డి ఫ్రాన్స్’ రేసు జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. 1903లో తొలిసారి ‘టూర్ డి ఫ్రాన్స్’ రేసు జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment