బన్నీ ఫ్యాన్స్‌కు షాక్.. పుష్ప-2 మూవీ వాయిదా..? | Allu Arjun Pushpa 2 The Rule postponed for This Reason | Sakshi
Sakshi News home page

Pushpa 2 The Rule: పుష్ప-2 నుంచి కీలక వ్యక్తి అవుట్.. వాయిదా తప్పదా?

Published Thu, May 16 2024 5:21 PM | Last Updated on Thu, May 16 2024 5:45 PM

Allu Arjun Pushpa 2 The Rule postponed for This Reason

ఐకాన్‌ స్టార్‌, సుకుమార్‌ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటేడ్ మూవీ పుష్ప-2: ది రూల్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌, టీజర్‌ రిలీజ్ చేయగా సోషల్ మీడియాను షేక్ చేశాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్పకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో యాంకర్ అనసూయ.. మరోసారి దాక్షాయణిగా మెప్పించనున్నారు. తాజాగా అనసూయ బర్త్ డే సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్‌ రివీల్‌ చేశారు మేకర్స్.

పుష్ప-2 వాయిదా?

అయితే ఇప్పటికే ఈ మూవీ రిలీజ్‌ తేదీని కూడా ప్రకటించారు డైరెక్టర్‌ సుకుమార్‌. ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో పుష్ప-2 సందడి చేయనుందని వెల్లడించారు. అయితే తాజాగా ఈ మూవీ విడుదల వాయిదా పడుతుందనే లేటేస్ట్‌ టాక్‌ వినిపిస్తోంది. పుష్ప-2 మూవీ ఎడిటర్‌ ఆంటోనీ రూబెన్‌ డేట్స్‌ విషయంలో సమస్యలు రావడంతో ఆయన తప్పుకున్నట్లు సమాచారం. మరోవైపు ఎడిటింగ్‌ పూర్తి చేయడానికి నవీన్‌ నూలిని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ నేపథ్యంలోనే పుష్ప-2 రిలీజ్ వాయిదా పడుతుందనే వార్తలు ఊపందుకున్నాయి. దీంతో బన్నీ ఫ్యాన్స్‌ ఆందోళనకు గురవుతున్నారు.

అదే రోజు రిలీజ్

మరోవైపు అల్లు అర్జున్‌ ఈ నెలలో సినిమా షూటింగ్ పూర్తి చేస్తాడని చిత్రయూనిట్ పేర్కొంది.  జూన్ నాటికి మిగిలిన షూటింగ్ పూర్తి అవుతుందని.. సినిమా విడుదల విషయంలో ఎలాంటి ఆలస్యం జరగదని అంటున్నారు. కాగా.. ఇప్పటికే ఆగస్టు 15వ తేదీన తప్పకుండా రిలీజ్ చేస్తామని సుకుమార్‌ చాలాసార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement