ఎస్‌ఎంసీ ఎన్నికలు వాయిదా | Esensi elections postponed | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎంసీ ఎన్నికలు వాయిదా

Published Wed, Jul 20 2016 12:34 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

Esensi elections postponed

అనంతపురం ఎడ్యుకేషన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించాల్సిన స్కూల్‌ మెనేజ్‌మెంట్‌ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు మళ్లీ వాయిదా పడ్డాయి. మార్చిలో ఒకసారి షెడ్యూలు విడుదల చేసిన ప్రభుత్వం తీరా ఎన్నికలకు రెండు రోజులు ముందు వాయిదా వేసింది. తాజాగా ఈనెల 26న నిర్వహించాల్సిన స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీల ఎన్నికలు వాయిదా వేశారు. బుధవారం పాఠశాలల వారీగా నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. మంగళవారం రాత్రి ఆఘమేఘాల మీద వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్‌ఎంసీల ఎన్నికలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని జిల్లా విద్యాశాఖ, సర్వశిక్ష అభియాన్‌ కార్యాలయాలకు ఉత్తర్వులు అందాయి. తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నామని, తర్వాత తేదీ ఎప్పుడనేది ముందుగా తెలియజేస్తామని ఇంతకు మించి వివరాలు తెలియదని డీఈఓ అంజయ్య తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement