నాగచైతన్య పాల్గొనాల్సిన వార్ వాయిదా పడింది. ఆమిర్ ఖాన్ హీరోగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఆస్కార్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’(1994)కు ఇది హిందీ రీమేక్. ఇందులో నాగచైతన్య ఓ కీలక పాత్ర చేయనున్నారు. చైతూకు బాలీవుడ్‌లో ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఈ సినిమా షూటింగ్‌ను ఈ నెలాఖరున లఢక్, కార్గిల్ లొకేషన్స్‌లో జరపాలనుకున్నారు. ఈ షెడ్యూల్‌లో వార్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది. ఆమిర్ ఖాన్, దర్శకుడు అద్వైత్ అక్కడి వెళ్లి తమ సినిమా షూటింగ్‌కు అనువైన లొకేషన్స్‌ను కూడా పరిశీలించారు. కానీ ఈ నెలలో జరగాల్సిన ఈ సినిమా చిత్రీకరణ వాయిదా çపడిందని బాలీవుడ్ టాక్. కరోనా సెకండ్ వేవ్, లఢక్, కార్గిల్ లొకేషన్స్‌కు సంబంధించిన అనుమతులు వంటి కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడిందనే టాక్ వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment