
న్యూఢిల్లీ: కోవిడ్ దృష్టా కేంద్రం ప్రభుత్వం పలు పరీక్షలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా జేఈఈ మెయిన్స్ వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ మంగళవారం ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా విద్యార్థులకు సూచించారు. కోవిడ్ విజృంభణ వల్ల పరీక్ష వాయిదా వేస్తున్నామన్నారు. ఇప్పటికే నీట్ పరీక్ష వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
చదవండి: కటాఫ్ ఎక్కువే!
Comments
Please login to add a commentAdd a comment