
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శనివారం (19న) తలపెట్టిన సమ్మెను అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) వాయిదా వేసుకుంది. తమ డిమాండ్లలో ఎక్కువ శాతం పరిష్కారానికి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంగీకరించినట్టు ప్రకటించింది.
దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు యథావిధిగా కార్యకలాపాలు సాగిస్తాయని తెలిపింది. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని అంగీకారానికి వచ్చినట్టు, దీంతో సమ్మెను వాయిదా వేసుకుంటున్నట్టు వివరించింది.