Chiranjeevi, Twenty Days Of Work Is Pending Of Acharya Movie Shooting - Sakshi
Sakshi News home page

Acharya Moive: ఇరవై రోజులే ఉంది!

Published Fri, May 28 2021 12:49 AM | Last Updated on Fri, May 28 2021 10:21 AM

20-days of work is pending of Acharya movie shooting - Sakshi

జస్ట్‌ 20 రోజులు షూటింగ్‌ జరిగి ఉంటే ‘ఆచార్య’ చిత్రబృందం గుమ్మడికాయ కొట్టేసేవాళ్లు. కానీ కరోనా ‘ఆచార్య’ ప్లాన్‌ను కాస్త అటూ ఇటూ చేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరణకు తాత్కాలిక బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ పూర్తయిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మొత్తం 20 రోజుల షూటింగ్‌ను నాన్‌స్టాప్‌గా జరిపేలా ప్లాన్‌ చేస్తున్నారట కొరటాల శివ. చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో రామ్‌చరణ్‌ ఓ కీ రోల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రామ్‌చరణ్‌ సరసన పూజా హెగ్డే కనిపిస్తారు. ఈ ఏడాది మే 13న విడుదల కావాల్సిన ‘ఆచార్య’ చిత్రం కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement