వారం ఆలస్యంగా...  | Tamannaah Bhatia new movie postpone | Sakshi
Sakshi News home page

వారం ఆలస్యంగా... 

Published Sat, Apr 20 2024 1:44 AM | Last Updated on Sat, Apr 20 2024 1:44 AM

Tamannaah Bhatia new movie postpone - Sakshi

సుందర్‌ .సి కీలక పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘అరణ్మనై 4’. ఇందులో తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఖుష్బు సుందర్, ఏసీఎస్‌ అరుణ్‌ కుమార్‌ నిర్మించారు. ఈ మూవీని ‘బాక్‌’ పేరుతో ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎల్‌ఎల్‌పీ తెలుగులో విడుదల చేస్తోంది. ఈ నెల 26న తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీని రిలీజ్‌ చేయాలనుకున్నారు.

అయితే ఎండల తీవ్రత అధికంగా ఉండటం వలన విడుదలను వాయిదా వేశామని మేకర్స్‌ ప్రకటించారు. వారం ఆలస్యంగా మే 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘వెన్నెల’ కిశోర్, శ్రీనివాస్‌ రెడ్డి, ఢిల్లీ గణేశ్, కోవై సరళ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: హిప్‌హాప్‌ తమిళ, కెమెరా: కృష్ణమూర్తి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement