
వాషింగ్టన్ : ప్రపంచ కుబేరుడు, ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ‘అమెజాన్’ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కూడా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి కార్లను పార్కింగ్ చేసినందుకు గానూ స్థానిక ప్రజా పన్నుల శాఖకు దాదాపు 18 వేల డాలర్లు బకాయి పడ్డారు. 2016 అక్టోబర్ నుంచి 2019 అక్టోబర్ వరకు ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా కార్లు పార్కింగ్ చేసినందుకు మొత్తం 564 చలాన్ల రూపంలో మొత్తం 16,840 డాలర్ల జరిమానా పడింది. వాటిని ఆయన సకాలంలో చెల్లించక పోవడంతో ఆ మొత్తం విలువ 18 వేల డాలర్లకు చేరుకుంది.
వాటిలో ఆయన ఇటీవల కొన్ని చలాన్లను చెల్లించినప్పటికీ ఇంకా 5,600 డాలర్లను చెల్లించాల్సి ఉందని మోటారు వాహనాల విభాగం వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది. వాషింగ్టన్ డీసీ నగరంలో ఆయన 34 వేల చదరపు అడుగుల్లో ఆయన విశాలమైన భవంతిని నిర్మించిన సమయంలో అలాగే 2016లో టెక్స్‌టైల్ మ్యూజియంను కొనుగోలు చేసి దానికి మరమ్మతు చేసిన సమయంలో రెండు భవనాల వద్ద కార్లను అక్రమంగా పార్కింగ్ చేయడం ఈ జరిమానాలు పడ్డాయి. వాషింగ్టన్ డీసీలో ప్రస్తుతం అతి విశాలమైన భవనం 2,700 చదరపు అడుగులు కాగా, అంతకంటే విశాలంగా 34 వేల చదరపు గజాల స్థలంలో జెఫ్ భవంతిని నిర్మించారు. అందులో 11 పడక గదులు, ఒక బాల్ రూమ్, ఒక వైన్ సెల్లార్, విస్కీ టేస్టింగ్ రూమ్, ఓ సినిమా థియేటర్, సిట్టింగ్ స్థలాలు దాదాపు వెయ్యి ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ఆస్తి 12900 కోట్ల డాలర్లని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment