ఇలా మాత్రం పార్కింగ్ చెయ్యకండి | Bangalore Horrible Parking Video | Sakshi
Sakshi News home page

ఇలా మాత్రం పార్కింగ్ చెయ్యకండి

Published Sat, Oct 28 2017 9:01 PM | Last Updated on Sun, Oct 29 2017 8:24 AM

Bangalore Horrible Parking Video

సాక్షి, బెంగళూర్‌ : కాస్త సందు దొరికితే చాలూ పార్కింగ్ చేసేద్దామని తాపత్రయపడే వాహనాదారుల కోసం ఈ వీడియో. పోస్ట్ చేసింది ఎవరో కాదు.. ఐపీఎస్‌ అధికారిణి డీ రూప. 

ఓ వ్యక్తి తన బైక్‌ను సందులో దూర్చేయాలని యత్నించాడు. బైక్‌ స్టాండ్ వేసే సమయంలో పక్కకు ఒరిగి కిందకు పడిపోయాడు. బైక్‌తోసహా కింద పడ్డ ఆ దృశ్యం చాలా భయానకంగా ఉంది. అయితే అదృవశాత్తూ అతని ప్రాణాలకు ముప్పు ఏం వాటిల్లలేదు. స్థానికులు వచ్చి అతన్ని లేపారు. 

గత నెల 20వ తేదీన ఓ కిరాణ షాపు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దయచేసి సురక్షిత ప్రాంతంలో పార్కింగ్ చెయ్యండి.. నిర్లక్ష్యంగా ఇలా చేయకండి రూప వీడియోను తన ట్విట్టర్‌లో నిన్న ఈ వీడయోను పోస్ట్ చేయగా.. అనూహ్య స్పందన వస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement