IPS roopa
-
ఐపీఎస్ రూపా Vs ఐఏఎస్ రోహిణి: కాల్ లీక్ ప్రకంపనలు.. ఆ ఆడియోలో ఏముంది?
బనశంకరి(కర్ణాటక): ఐపీఎస్ రూపా మౌద్గిల్, ఐఏఎస్ రోహిణి సింధూరి మధ్య గత ఆదివారం నుంచి తలెత్తిన సంగ్రామం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. రోజుకొక కొత్త మలుపు తిరుగుతూ తీవ్ర చర్చను రేకెత్తిస్తోంది. వివాదం నేపథ్యంలో వారిద్దరికి ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా సర్కారు బదిలీ చేయడం తెలిసిందే. కాల్ లీక్ ప్రకంపనలు తాజాగా రూపా మౌద్గిల్– సామాజిక కార్యకర్త గంగరాజు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో బయటపడింది. ఇందులో రూపా తీవ్ర ఆరోపణలు చేయడం ఉంది. కబిని వద్ద ఒక స్థలం డీల్ చేయడానికి భూ రికార్డుల కోసం రోహిణి సింధూరి నా భర్త, ఐఏఎస్ మౌనీశ్ వద్ద సమాచారం తీసుకుందని రూపా ఆ ఆడియోలో చెప్పారు. రూపా గతంలో చేసిన ఆరోపణలను మళ్లీ ఈ కాల్లో ప్రస్తావించారు. ఆడియో మరిన్ని ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎమ్మెల్యే సారా మహేశ్ కేసును వెనక్కి తీసుకోవడానికి రాజీకోసం హెచ్డీ.కుమారస్వామి, హెచ్డీ.దేవేగౌడ, ఇద్దరు ఐఏఎస్‌ల ద్వారా రోహిణి ఒత్తిడి తీసుకువచ్చినట్లు చెప్పారు. అంతేగాక ఆడియోలో గంగరాజుపైన రూపా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఆమెను సపోర్టు చేస్తున్నారా, నువ్వు ఫైల్ పట్టుకుని పదేపదే ఆమె వద్దకు వెళ్లడం తప్పా ఏముంది, కాల్ రికార్డు చేసుకుంటావా, చేసుకో, నాకు వచ్చే కోపానికి.. అంటూ అసభ్య పదజాలంతో దూషించడం రికార్డయింది. మైసూరులో ఆడియో విడుదల ఐపీఎస్ రూపాతో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియోను బుధవారం మైసూరులో సామాజిక కార్యకర్త గంగరాజు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో గొడవ మరింత జఠిలమయ్యే సూచనలే ఉన్నాయి. ప్రస్తుతం ఆ ఆడియో హాట్ టాపిక్‌గా మారింది. రోహిణి సింధూరి ఆమె పరిచయాలను ఉపయోగించుకుని భర్త అన్నను బీజేపీలోకి చేర్చాలని చూస్తోంది అని ఆడియోలో రూపా పేర్కొన్నారు. తన భర్త మౌనీశ్ తీరుపైనా, కుటుంబ వ్యవహారాలపైనా రూపా ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రూపా నన్ను పావుగా వాడాలని చూశారు. ఈ సందర్భంగా మీడియాతో గంగరాజు మాట్లాడుతూ ఐపీఎస్ రూపా నాపై కోపంతో మాట్లాడారు. నాతో 25 నిమిషాలు మాట్లాడారు. రోహిణి సింధూరికి వ్యతిరేకంగా పోరాటం కోసం నన్ను ఉపయోగించుకునేందుకు ఆమె యత్నించారు. నాకు ఫోన్ చేసి భూ వ్యవహారాల గురించి సీబీఐ అధికారిలా ప్రశ్నించారు, రూపా నా మొబైల్ నుంచి ఫోటో తీసుకుని, వాట్సాప్ చాట్‌ను ఎమ్మెల్యే సా.రా మహేశ్‌కు పంపించారు. చదవండి: ఐపీఎస్ రూపా మౌద్గిల్‌ను కట్టడి చేయండి నన్ను అసభ్య పదజాలంతో మాట్లాడారు. రోహిణి అక్రమాల గురించి నా వద్ద సాక్ష్యాలు ఉన్నాయని, మీడియా వద్ద వాటి గురించి మాట్లాడు అని చెప్పగా అందుకు నేను నిరాకరించానని ఆయన చెప్పారు. నా కుటుంబానికి ఏమైనా అయితే రూపానే కారణం. అధికారం మాటున ఆమె ఏమైనా చేయొచ్చని ఆయన ఆరోపించారు. ఆమె నా రాకపోకలను, కార్యకలాపాలపై నిఘా వేశారు, రూపాపై క్రిమినల్ కేసు వేస్తా అన్నారు. -
గొడవకు మూల్యం.. ఆ ఇద్దరికీ ప్రభుత్వం షాక్!
బనశంకరి: నువ్వెంత అంటే, నువ్వెంత అని ఆరోపణలు చేసుకుని అమీతుమీకి సిద్ధమైన ఐపీఎస్ అధికారిణి డి.రూపా మౌద్గిల్, ఐఏఎస్ అధికారిణి డి.రోహిణి సింధూరి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి మండలి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఐపీఎస్ రూపాను బదిలీచేసి, ఆ పోస్టులో ఐఏఎస్ భారతిని సర్కారు నియమించింది. దేవాదాయశాఖ కమిషనర్ పోస్టు నుంచి రోహిణిని బదిలీ చేసి ఆ స్థానంలో హెచ్.బసవరాజేంద్రను నియమించింది. రూప, రోహిణికి ఎలాంటి పోస్టులు లేకుండా వెయిటింగ్లో ఉంచడం గమనార్హం. ఐపీఎస్ రూప భర్త బదిలీ ఇక ఐపీఎస్ రూప భర్త మౌనీశ్ మౌద్గిల్ ఐఏఎస్ అధికారి కాగా, ఆయన ప్రస్తుతం సర్వే, భూరికార్డుల శాఖ కమిషనర్‌గా ఉండేవారు. తాజా గొడవల నేపథ్యంలో ఆయనకు కూడా బదిలీ తప్పలేదు. సిబ్బంది పరిపాలనా శాఖ ప్రధాన కార్యదర్శిగా ఆయనకు స్థానభ్రంశమైంది. ఆయన పోస్టులో సర్వేశాఖ అదనపు డైరెక్టర్ గా ఉన్న సీఎన్.శ్రీధర్‌కు అవకాశం దక్కింది. ఈ బదిలీల్లో భాగంగా పోస్టింగ్ కోసం వేచిచూస్తున్న ఐఏఎస్ హెచ్వీ.దర్శన్ ను తుమకూరు మహానగర పాలికె కమిషనర్‌గా నియమించింది. ఘాటుగా నోటీసులు ఇద్దరు మహిళా అధికారుల విభేదాల వల్ల ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఉభయులకూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందిత శర్మ సూచనమేరకు నోటీసులు అయ్యాయి. హద్దుమీరి ప్రవర్తించరాదని అందులో హెచ్చరించారు. ఆరోపణలు చేసుకోవడం స రీ్వస్ బంధనల ఉల్లంఘన కు పాల్పడినట్లు అవుతుంది, బహిరంగంగా మాట్లాడరాదు, ఒకవేళ మళ్లీ మాటల యుద్ధానికి దిగితే కఠినచర్యలు తీసుకుంటామని నోటీస్‌లో పేర్కొన్నారు. మీ ఆరోపణలను ప్రభుత్వం ముందు పెట్టవచ్చు, ఇకపై మీడియా ముందుకు వెళ్లరాదని నోటీసుల్లో సిబ్బంది, పరిపాలన శాఖ అదనపు కార్యదర్శి జేమ్స్ తారకన్ పేర్కొన్నారు. రూపపై కేసు నమోదుపై మీమాంస రోహిణి సింధూరి భర్త సుదీర్‌రెడ్డి ఐపీఎస్ రూపాపై బాగలగుంటె పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. తన భార్య ఫోన్‌ను హ్యాక్ చేసి ఫోటోలు దొంగిలించారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదుపై పోలీసులు న్యాయ నిపుణులతో సంప్రదించారు. ఒకవేళ కేసు నమోదు చేయకపోతే కోర్టుకు వెళ్లి ఎఫ్ఐఆర్ని నమోదు చేయించాలని రోహిణి కుటుంబసభ్యులు సిద్దమయ్యారు. కేబినెట్ భేటీలో చర్చ సోమవారం సాయంత్రం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో రూపా– రోహిణి రగడ గురించి కొందరు మంత్రులు లేవనెత్తారు. ముఖ్యమంత్రి బొమ్మై సైతం తీవ్రంగా పరిగణించి వారిని బదిలీ చేయాలని సూచించినట్లు తెలిసింది. ఆదివారం రూపా ఫేస్బుక్ ద్వారా ఆరోపణలు చేయడం, అందుకు రోహిణి ఘాటుగా బదులివ్వడం, సోమవారం వివాదం విధానసౌధకు చేరి ఇద్దరూ మీడియా ముందు అక్కసు వెళ్లగక్కడంతో వేడెక్కింది. మంగళవారం ఇరువర్గాలూ మౌనం దాల్చడంతో శాంతియుత వాతావరణం ఏర్పడింది. -
మహిళా ఐపీఎస్, ఐఏఎస్‌ల గొడవ.. సర్కారు సీరియస్.. ఇద్దరికీ నోటిసులు
బనశంకరి: కర్ణాటకలో ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరిపై ఐపీఎస్ రూపా మౌద్గిల్ బహిరంగ ఆరోపణలు, ఆమె ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేయడంపై రగడ రాజుకుంది. దీంతో ప్రభుత్వం సోమవారం ఇద్దరికీ నోటీసులను జారీచేసింది. ఇద్దరూ వేర్వేరుగా రాష్ట్ర సీఎస్ వందిత శర్మను కలిసి వివరణ ఇచ్చారు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం వరకు రోహిణిపై రూపా ఫేస్బుక్ ద్వారా తీవ్ర ఆరోపణలను గుప్పించారు. సోమవారం రోహిణి సింధూరి బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న రూపాకు చికిత్స చేయించాలన్నారు. ప్రచారం కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను గతంలో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఫొటోలను సేకరించి దుష్పచారం చేస్తున్నారని ఆరోపించారు. వీరి వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రమైందిగా భావిస్తోందని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. వారి వ్యవహారంపై తాము కళ్లు మూసుకుని కూర్చోలేదని, చర్యలు తీసుకుంటామని, ఇద్దరూ హద్దు మీరి ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అంటే ప్రజాసేవకులని, ఆ హోదాలకు అవమానం చేశారని అన్నారు. తనకు తెలిసిన మేరకు వారిద్దరూ వ్యక్తిగత సమస్యల వల్లే దూషణలకు దిగుతున్నారని తెలిపారు. రోహిణి భర్త సుధీర్ రెడ్డి బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. తన కంటే పదేళ్లు జూనియర్ అయిన రోహిణీ సింధూరికి మంచి పేరు రావడం ఇష్టం లేకనే రూపా ఇలా ఆరోపణలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రోహిణి ఫోన్‌ను బ్లూటూత్ ద్వారా హ్యాక్ చేసి వ్యక్తిగత ఫొటోలను రూపా కాజేశారంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
‘లేడీ సింగం’ గాలి తీసేశారు!
సాక్షి, బెంగళూరు: ఒత్తిళ్లు, విమర్శలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనే 'లేడీ సింగం'గా మహిళా ఐపీఎస్ డి.రూప సోషల్ మీడియాలో చాలా పాపులర్. అయితే రూప చెప్పింది పచ్చి అబద్ధమంటూ తేల్చింది నమ్మ బెంగళూరు ఫౌండేషన్ (ఎన్బీఎఫ్). ఎన్బీఎఫ్ ఎన్జీఓ సంస్థ తనకు అవార్డు ఇచ్చేందుకు సిద్ధమైనా తిరస్కరించినట్లు ప్రకటించి సంచలనానికి తెరలేపారు రూప. అవార్డు స్వీకరించినలేనని ఫౌండేషన్ సీఈవో ఎన్బీఎఫ్ శ్రీధర్ శెట్టికి ఆమె లేఖ రాయడం నిజం కాదని యాజమాన్యం వెల్లడించింది. నమ్మ బెంగళూరు ఫౌండేషన్ సిబ్బంది మీడియాతో మాట్లాడుతూ.. అసలు తాము ఐపీఎస్ రూపకు అవార్డు ప్రకటించలేదన్నారు. అలాంటిది ఎన్బీఎఫ్ ఇచ్చే అవార్డును స్వీకరించనంటూ ఆమె ఎలా ప్రకటన చేస్తారంటూ మండిపడ్డారు. అవార్డు స్వీకరించలేనని చెప్పిన రూప.. ఆ అవార్డు తనకు దక్కించుకునేందుకు జ్యూరీ సభ్యులు, ఎన్బీఎఫ్ బృందం, ట్రస్టీలతో పలుమార్లు చర్యలు జరిపారని ఆ సంస్థ వెల్లడించడంతో 'లేడీ సింగం' వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. నమ్మ బెంగళూరు ఫౌండేషన్ చరిత్రలో అవార్డు కోసం ఓ నామినీ ఇలా ప్రలోభాలకు పాల్పడటం, జ్యూరీ సభ్యులు, ఎన్బీఎఫ్ బృందంతో చర్చలు జరపడం తొలిసారి చూస్తున్నామని పెదవి విరవడం గమనార్హం. అవార్డు ప్రకటించకున్నా 'లేడీ సింగం' లేఖ ఇటీవల ఐపీఎస్ రూప లేఖ రాయడమే వివాదానికి కారణమైంది. ‘ ఎన్బీఎఫ్ అవార్డుకు నా పేరును ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. కానీ, ఈ అవార్డు స్వీకరించేందుకు నా మనస్సాక్షి ఒప్పకోవడం లేదు. రాజకీయాలకు, రాజకీయ అనుబంధ సంస్థలకు ప్రభుత్వ అధికారులు వీలైనంత దూరంగా ఉండాలి. అప్పడే ప్రజల మనసులో మచ్చలేని అధికారులుగా ఉంటారు. కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో నా అవార్డు అంశం రాజకీయం కావటం నాకు ఇష్టం లేదని’ లేఖలో రూప పేర్కొన్నారు. నమ్మ బెంగళూరు ఫౌండేషన్ అనే సంస్థ ప్రతి సంవత్సరం ఐదు రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులను అందిస్తోంది. అందులో ఉత్తమ ప్రభుత్వ అధికారి కేటగిరీ కోసం కోసం 8 మంది పేర్లతో ఒక జాబితాను తయారు చేసింది. ఈ లిస్ట్‌లో ఐజీ (హోమ్‌గార్డ్ అండ్ సివిల్ డిఫెన్స్) రూప పేరును కూడా పరిశీలనలోకి తీసుకుంది. అయితే ఆ జాబితా నుంచి తన పేరును తొలగించాలని కోరడంతో ఫౌండేషన్ సిబ్బంది ఐపీఎస్ రూప చెప్పింది పచ్చి అబద్ధాలని స్పష్టం చేసింది. అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ జైలు రాజభోగాలను బయటపెట్టి రూప వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. -
అంతరాత్మ ఒప్పుకోవట్లేదు.. వద్దు
సాక్షి, బెంగళూరు: అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ రాజభోగాలను వెలుగులోకి తెచ్చి వార్తల్లో నిలిచారు ఐపీఎస్ అధికారిణి రూప. ఒత్తిళ్లు, విమర్శలు ఎదురైనప్పటికీ నిర్భయంగా నిజాలను వెలుగులోకి తెచ్చి లేడీ సింగంగా ఆమె సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మరోసారి వార్తల్లో కెక్కారు. నమ్మ బెంగళూరు ఫౌండేషన్ అనే సంస్థ ప్రతి సంవత్సరం ఐదు రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులను అందిస్తోంది. అందులో ఉత్తమ ప్రభుత్వ అధికారి కేటగిరీ కోసం కోసం 8 మంది పేర్లతో ఒక జాబితాను తయారు చేసింది. ఈ లిస్ట్‌లో ఐజీ(హోమ్‌గార్డ్ అండ్ సివిల్ డిఫెన్స్) అయిన రూప పేరును కూడా పరిశీలనలోకి తీసుకుంది. అయితే ఆ జాబితా నుంచి తన పేరును తొలగించాలని ఆమె కోరుతున్నారు. ఈ మేరకు ఫౌండేషన్ సీఈవో ఎన్బీఎఫ్ శ్రీధర్ శెట్టికి ఆమె లేఖ రాశారు. ‘ జాబితాలో నా పేరును ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. కానీ, ఈ అవార్డు స్వీకరించేందుకు నా మనస్సాక్షి ఒప్పకోట్లేదు. రాజకీయాలకు, రాజకీయ అనుబంధ సంస్థలకు ప్రభుత్వ అధికారులు వీలైనంత దూరంగా ఉండాలి. అప్పడే ప్రజల మనసులో మచ్చలేని అధికారులుగా ఉంటారు. కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో నా అవార్డు అంశం రాజకీయం కావటం నాకు ఇష్టం లేదు’ అని ఆమె లేఖలో పేర్కొన్నారు. కాగా, నమ్మ బెంగళూరు ఫౌండేషన్ అధినేత బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్. ఆయన తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఎంపీగా నెగ్గారు. ఈ నేపథ్యంలో ఆ ఫౌండేషన్ తరపున అవార్డు ద్వారా వివాదంలో చిక్కుకోవటం ఎందుకని రూప భావించినట్లు స్పష్టమౌతోంది. -
ఇలా మాత్రం పార్కింగ్ చెయ్యకండి
-
ఇలా మాత్రం పార్కింగ్ చెయ్యకండి
సాక్షి, బెంగళూర్ : కాస్త సందు దొరికితే చాలూ పార్కింగ్ చేసేద్దామని తాపత్రయపడే వాహనాదారుల కోసం ఈ వీడియో. పోస్ట్ చేసింది ఎవరో కాదు.. ఐపీఎస్ అధికారిణి డీ రూప. ఓ వ్యక్తి తన బైక్‌ను సందులో దూర్చేయాలని యత్నించాడు. బైక్ స్టాండ్ వేసే సమయంలో పక్కకు ఒరిగి కిందకు పడిపోయాడు. బైక్‌తోసహా కింద పడ్డ ఆ దృశ్యం చాలా భయానకంగా ఉంది. అయితే అదృవశాత్తూ అతని ప్రాణాలకు ముప్పు ఏం వాటిల్లలేదు. స్థానికులు వచ్చి అతన్ని లేపారు. గత నెల 20వ తేదీన ఓ కిరాణ షాపు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దయచేసి సురక్షిత ప్రాంతంలో పార్కింగ్ చెయ్యండి.. నిర్లక్ష్యంగా ఇలా చేయకండి రూప వీడియోను తన ట్విట్టర్లో నిన్న ఈ వీడయోను పోస్ట్ చేయగా.. అనూహ్య స్పందన వస్తోంది. -
వెండితెరపై సాహస వనిత
ఐపీఎస్ రూప జీవితం, పరప్పన జైలు అక్రమాలే కథ కన్నడ, తమిళంలో సినిమా నిర్మాణం దర్శకుడు ఏఎంఆర్ రమేష్ సన్నాహాలు ఈ నెల 29న ప్రకటన సాక్షి, బెంగళూరు: నిజజీవితంలో సంచలనాలు సాధించిన పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, కళాకారులపై ఎన్నో సినిమాలు వచ్చాయి. అదే కోవలో మరో సినిమా కూడా రావడం ఖాయమైంది. తాజాగా బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో గుట్టురట్టయిన అక్రమాలపై శాండల్‌వుడ్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. ఆ జైల్లో అవినీతి గురించి ధైర్యంగా బట్టబయలు చేసిన మహిళా ఐపీఎస్ అధికారి డీ.రూప జీవితం ఈ చిత్ర కథాంశం. వాస్తవ ఘటనల ఆధారంగా సైనైడ్, అట్టహాస వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఏ.ఎం.ఆర్.రమేశ్ ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నా డీఎంకే నాయకురాలు శశికళకు అతిథి మర్యాదలు కల్పించడానికి అధికారులు రూ.2 కోట్లు లంచం తీసుకున్నట్లు ఐపీఎస్ అధికారి డీ.రూప తమ నివేదిక ద్వారా వెలుగులోకి తెచ్చారు. అనంతర పరిణామాలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశాలుగా మారాయి. ఈ ఘటనల ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించడానికి దర్శకుడు రమేశ్ సన్నాహాలు చేస్తున్నారు. జైలు వ్యవహారాలపై దర్యాప్తు అధికారులు నాలుగు దక్షిణాది రాష్ట్రాల అధికారులను, రాజకీయ నాయకులను, బిల్డర్లను రహస్య విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రూప, పరప్పన జైలు కథను దర్శకుడు రమేష్ అందరికంటే ముందే ఎంచుకున్నారు. సినిమాను ఏక కాలంలో కన్నడ, తమిళ భాషల్లో చిత్రీకరిస్తారని తెలిసింది. తెలుగులోకి కూడా అనువదించి విడుదల చేసే అవకాశాన్ని చిత్ర యూనిట్ పరిశీలిస్తోంది. ఈ చిత్రంలోనే జైళ్లలో వాస్తవ పరిస్థితులతో పాటు గతంలో ఒక డీఐజీ ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వైనాన్ని చూపించించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇప్పటికే పోలీసు పాత్రలకు శాండల్‌వుడ్‌లో మంచి పేరు గడించిన సీనియర్ నటి మాలాశ్రీ కాని, ఇప్పుడిప్పుడే పోలీస్పాత్రలు వేస్తున్న రాగిణి ద్వివేదిని కానీ ఎంచుకునే అవకాశం ఉంది. మరోవైపు చిత్రంలో కనీసం ఒక్క సీన్ లో నైనా ఐపీఎస్ అధికారి రూపను నటింపచేయాలని చిత్ర యూనిట్ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు గాంధీనగర్ వర్గాలు చెబుతున్నాయి. చిత్ర కథలో జైలు అక్రమాలు, ఐపీఎస్‌గా రూప తీసుకున్న సంచలన నిర్ణయాలు చిత్రకథలో ఉంటాయి. రూప అనుమతి తీసుకుంటాం చిత్ర దర్శకుడు ఏ.ఎం.ఆర్.రమేశ్ మాట్లాడుతూ 'కన్నడ, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. తెలుగులో కూడా విడుదల చేసే విషయం కూడా పరిశీలనలో ఉంది. ఐపీఎస్ అధికారి డీ.రూప ఛేదించిన అవినీతి ఘటనల ఆధారంగా తీయనున్నాం. చిత్రం టైటిల్లో రూప పేరు కూడా ఉండనుండడంతో ఐపీఎస్ అధికారి డీ.రూప అనుమతి తప్పనిసరి. ఇప్పటికే సినిమాపై పోలీస్‌శాఖ ఉన్నతాధికారులతో చర్చించాం. జులై 29న మరోసారి వారితోను, చిత్రానికి మూలాధారమైన ఐపీఎస్ డీ.రూపతోను చర్చించి ఆమోదాల అనంతరం షూటింగ్ ప్రారంభిస్తామ'న్నారు.