ట్రాఫిక్ మళ్లింపులు ఇలా.... | Traffic Restrictions and Diversions for Ganesh immersion in hyderabad | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్ మళ్లింపులు ఇలా....

Published Sat, Sep 26 2015 5:47 PM | Last Updated on Sun, Sep 3 2017 10:01 AM

Traffic Restrictions and Diversions for Ganesh  immersion in hyderabad

నగరంలో గణేశ్ నిమజ్జనయాత్రను సాఫీగా నిర్వహించేందుకు నగర, సైబరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు. మెట్రో నిర్మాణ పనులతో శోభాయాత్రకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ ప్రాంతాలు, నిమజ్జనం తర్వాత వెళ్లాల్సిన మార్గాలను నగర పోలీసు కమిషనర్ శుక్రవారం విడుదల చేశారు. ట్యాంక్‌బండ్ వద్ద వైభవంగా జరిగే నిమజ్జన దృశ్యాలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం కూడా బస్సులు ఉంటాయని, అయితే నిర్ణీత సూచించిన ప్రదేశంలో వాటిని నిలుపనున్నారని చెప్పారు.
 
 సౌత్ జోన్: కేశవగిరి, మహబూబ్‌నగర్ ఎక్స్ రోడ్స్, ఇంజిన్ బౌలి, నాగుల్ చింత, హిమ్మాత్‌పుర, హరిబౌలి, అస్రా హాస్పిటల్, మొఘుల్‌పుర, లక్కడ్ కోటే, మదీనా ఎక్స్ రోడ్డు, ఎంజే బ్రిడ్జి, దార్ ఉల్ సిఫా ఎక్స్ రోడ్స్, సిటీ కాలేజ్
 
 ఈస్ట్ జోన్: చంచల్‌గూడ జైలు ఎక్స్ రోడ్స్, మూసారం బాగ్, చాదర్‌ఘాట్ బ్రిడ్జి, సలర్‌జంగ్ బ్రిడ్జి(శివాజీ బ్రిడ్జి), అఫ్జల్‌గంజ్, పుతిలిబౌలి ఎక్స్ రోడ్స్, ట్రూప్ బజార్, జామ్‌బాగ్ ఎక్స్ రోడ్స్, ఆంధ్రా బ్యాంక్ కోఠి
 
 వెస్ట్ జోన్: టోప్‌ఖానా మసీద్, అలస్కా హోటల్ జంక్షన్, ఉస్మాన్‌గంజ్, తాజ్ ఐలాండ్, బర్తన్ బజార్, ఏఆర్ పెట్రోల్ పంప్
 
 సెంట్రల్ జోన్: చాపెల్ రోడ్డు ఎంట్రీ, జీపీఓ, శాలిమార్ థియేటర్, గన్‌ఫౌండ్రీ, స్కైలైన్ రోడ్డు, దోమలగూడలోని భరత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సెంటర్ జంక్షన్, కంట్రోల్ రూమ్, లిబర్టీ సెంటర్, ఎంసీహెచ్ ఆఫీస్ వై జంక్షన్, బీఆర్‌కే భవన్ జంక్షన్, ఇక్బల్ మినార్, రవీంధ్ర భారతి, ద్వారకా హోటల్ జంక్షన్, ఖైరతాబాద్ జంక్షన్, చిల్డ్రన్స్ పార్క్, వైశ్రాయ్ హోటల్ జంక్షన్, కవాడిగూడ జంక్షన్, ముషీరాబాద్ ఎక్స్ రోడ్డు, ఆర్‌టీసీ ఎక్స్ రోడ్డు, కట్టమైసమ్మ టెంపుల్, ఇందిరా పార్క్ జంక్షన్
 
 నార్త్‌జోన్: సీటీవో, వైఎంసీఏ, ప్యారడైస్ ఎక్స్ రోడ్డు, ప్యాట్నీ ఎక్స్ రోడ్డు, బాటా ఎక్స్ రోడ్డు, అదవయ్య ఎక్స్ రోడ్డు, గన్స్ మంది ఎక్స్ రోడ్డులు. కర్బలా మైదాన్, బుద్ధభవన్, సైలింగ్ క్లబ్, నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్‌రోడ్డు, అప్పర్ ట్యాంక్ బండ్‌లోని అనుమతి లేదు.
  (ఆదివారం ఉదయం ఆరు నుంచి సోమవారం ఉదయం ఎనిమిది గంటల వరకు ఈ ఆంక్షలు ఆమల్లో ఉంటాయి)
 
 పార్కింగ్ ఇక్కడ చేయండి
 
 ఖైరతాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్, ఆనంద్ నగర్ కాలనీ నుంచి ఆర్‌ఆర్ డిస్ట్రిక్ట్ జెడ్సీ ఆఫీసు, బుద్ధభవన్ వెనకల, గోసేవా సదన్, లోయర్ ట్యాంక్ బండ్, కట్టమైసమ్మ టెంపుల్, ఎన్టీఆర్ స్టేడియం, నిజామ్ కాలేజ్, పబ్లిక్ గార్డెన్స్
 
 నిమజ్జనం తర్వాత ఇలా వెళ్లాలిలా...
  *ఎన్టీఆర్ మార్గ్ ఘాట్:  నెక్లెస్ రోటరీ, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, వీవీ విగ్రహం, కేసీపీ మీదుగా వాహనాలు వెళ్లాలి. తెలుగు తల్లి, మింట్ కాంపౌండ్ మీదుగా అనుమతించరు.
 *అప్పర్ ట్యాంక్ బండ్ ఘాట్: చిల్డ్రన్స్ పార్క్, డీబీఆర్ మిల్స్, కవాడి గూడ, ముషీరాబాద్ మీదుగా వెళ్లాలి. బ్రిడ్జ్‌పై నుంచి  బైబిల్ హూస్ రైల్ మీదుగా అనుమతి లేదు.

 భారీ వాహనాలకు నో పర్మిషన్...
 అంతర్రాష్ట్ర, ఇతర జిల్లాల నుంచి వచ్చే భారీ వాహనాల(లారీ)లను 27 రాత్రి నుంచి 28వ తేదీ వరకు రాకపోకలు నిషేధించారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు శివారు ప్రాంతాల్లోనే ఉండాలి. ఎంజీబీఎస్‌కు వెళ్లే అంతర్రాష్ట్ర, జిల్లా బస్సులను కూడా 27వ తేదీ ఉదయం పది నుంచి 28వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు అనుమతి లేదు.  ప్రత్నామ్యాయ మార్గాల్లో బస్సులు నిలిపాల్సి ఉంటుంది. ప్రైవేట్ బస్సులకు నగరంలోకి అనుమతి ఉండదు.

 ప్రయాణికులు ఈ మార్గాల్లో రావద్దు
 ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారు, అక్కడి నుంచి వచ్చేవారు నెక్లెస్‌రోడ్డు, ఎన్‌టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్ రోడ్డు, అంబేద్కర్ విగ్రహం నుంచి ఫలక్‌నుమా ప్రధాన రహదారి వరకు మార్గాలకు రావద్దు. రైల్వేస్టేషన్, బస్టాండ్‌ల నుంచి వచ్చేవారు కూడా ఇదే నిబంధనను పాటించాలి.

 హైదరాబాద్ శోభయాత్ర మార్గాలివే...
 -కేశవగిరి నుంచి ప్రధాన శోభయాత్ర మొదలై అలియాబాద్, నాగుల్ చింత, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ, అప్పర్‌ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ వరకు చేరుకుంటుంది. కొన్ని జంక్షన్‌ల వద్ద ఇతర ప్రాంతాల నుంచి వచ్చే గణనాథులు కూడా కలిసి ఈ మార్గాల్లోనే హుస్సేన్‌సాగర్‌కు చేరుకుంటాయి.

 -సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహలను ఆర్‌పీ రోడ్డు, ఎంజీ రోడ్డు, కర్బలా మైదాన్, కవాడిగూడ, ముషీరాబాద్ ఎక్స్ రోడ్డు, ఆర్‌టీసీ క్రాస్ రోడ్డు, నారాయణగూడ ఎక్స్ రోడ్డు, హిమాయత్‌నగర్ వై జంక్షన్, లిబర్టీ మీదుగా ట్యాంక్‌బండ్ చేరకుంటాయి. ఉప్పల్, రామాంతపూర్, అంబర్‌పేట్, ఓయూలోని ఎన్‌సీసీ, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆస్పత్రి నుంచి వచ్చే వాహనాలు ఆర్‌టీసీ క్రాస్ రోడ్డు మీదుగా ట్యాంక్‌బండ్ చేరుకుంటాయి.  వెస్ట్‌జోన్ నుంచి వచ్చే కొన్ని గణనాథులు ఎంజే మార్కెట్, సెక్రటేరియట్-తెలుగు తల్లి విగ్రహం వద్ద కలుసుకొని నిమజ్జన ఘాట్‌కు చేరుకుంటాయి.  ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి సోమవారం ఉదయం ఎనిమిది గంటల వరకు ఈ ప్రధాన శోభయాత్ర ఆయా మార్గాల్లో జరగనుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement