ఆరిన దీపం
-
అగ్నిప్రమాదంలో అన్నదమ్ములకు తీవ్ర గాయాలు
-
అన్నయ్య మృతి.. చికిత్స పొందుతున్న తమ్ముడు
-
ఫ్యాన్సీ షాపు గోడౌ¯ŒSలో సంఘటన
-
దీపావళి రోజున కూనవరంలో విషాదం
ఎటుచూసినా దీపావళి సందడి. చిన్నాపెద్దా రాత్రి బాణసంచా కాల్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. పండగ ఆనందాన్ని అమ్మమ్మ, తాతయ్యతో పంచుకోవాలని అమ్మతో కలిసి ఆ చిన్నారి అన్నదమ్ములు ఊరొచ్చారు. ఆటల్లో మునిగి ఉన్న ఆ చిన్నారులను మంటలు కబళించాయి. అభంశుభం ఎరుగని ఆ పిల్లలు తీవ్ర గాయాల పాలయ్యారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ అన్నయ్య సోమవారం
తెల్లవారుజామున చనిపోయాడు.
– ఉప్పలగుప్తం
ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి గ్రామానికి చెందిన వాలా సత్యనారాయణమూర్తి(సత్తిబాబు) చిరు వ్యాపారి. గ్రామంలోనే ఫ్యాన్సీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అతడికి భార్య దుర్గ, కుమారులు తారక రామప్రసాద్ (సాయి)(7), వీరవెంకట దామోదర నాయుడు (వీరేంద్ర)(5) ఉన్నారు. ప్రైవేట్ కాన్వెంట్‌లో సాయి రెండో తరగతి చదువుతుండగా, వీరేంద్రను కొంతకాలం క్రితం ఒకటో తరగతిలో చేర్పించారు. తండ్రి సత్తిబాబు ఇటీవల అయ్యప్ప మాలధారణ చేశారు. దీపావళి సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో తల్లి దుర్గతో కలిసి సాయి, వీరేంద్ర అమ్మమ్మ ఊరైన ఉప్పలగుప్తం మండలం కూనవరం వెళ్లారు. కూనవరంలో తాతయ్య సుందరనీడి సుబ్బారావు ఫ్యాన్సీ వ్యాపారం చేస్తున్నారు. ఇంటి ముందు భాగంలో షాపు నిర్వహిస్తూ, ఇంటిలోనే ఓ గదిలో గోడౌ¯ŒS ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఎలక్ట్రికల్ వస్తువులు, పెయింట్లు, ఇతర జనరల్ సామగ్రి ఉన్నాయి.
షార్ట్‌సరŠూక్యట్‌తో..
ఇలాఉండగా ఆదివారం ఉదయం 10.30 సమయంలో సరకు నిల్వ ఉన్న గదిలో షార్ట్‌సర్క్యూట్ సంభవించింది. గదిలో నిల్వ ఉన్న సామగ్రికి మంటలు వ్యాపించాయి. అదే గదిలో ఆడుకుంటున్న సాయి, వీరేంద్ర మంటల్లో చిక్కుకుని, తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న అమలాపురం అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు మంటలను అదుపుచేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారులను అమలాపురంలోని ఓ ప్రెవేట్ ఆస్పత్రికి తరలించారు.
డిప్యూటీ సీఎం సందర్శన
సంఘటన స్థలాన్ని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మె ల్యే అయితాబత్తుల ఆనందరావు పరిశీలించారు. మెరుగైన వైద్యం కోసం చిన్నారులను కాకినాడకు తరలించాలని చినరాజప్ప ఆదేశించారు. పిల్లలను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున సాయి మరణించాడు. అతడి త మ్ముడు వీరేంద్రను జీజీహెచ్ నుంచి కాకినాడలోని ప్రెవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతున్నాడు. తాత సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఆర్.భీమరాజు తెలిపారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ వి.సత్యవతి, ఎంఆర్‌ఐ వినాయక వర్మ సందర్శించారు.
‘మా ఇంటి దీపం ఆరింది’
‘దీపావళి పండగ నాడు మా ఇంటి దీపం ఆరిపోయింది’ అంటూ సాయి తల్లి దుర్గ రోదించిన తీరు చూపరులను కం టతడి పెట్టించింది. కాలిన గాయాలతో చికిత్స పొందు తూ, మరణించిన సాయిని చూసి ఆమె తల్లడిల్లిపోయింది. ‘నా కుమారుడిని బతికించాలంటూ ప్రాథేయపడిన ఆమె ను సముదాయించడం బంధువులకు కష్టమైంది. సమాచారం అందుకున్న వెంటనే అయ్యప్ప మాలలో ఉన్న సత్తిబాబు హుటాహుటిన ఇక్కడకు చేరుకున్నాడు. అల్లారుముద్దుగా పెంచిన కుమారులు సాయి, వీరేంద్ర ఇలా ప్రమా దం బారిన పడడాన్ని సత్తిబాబు, దుర్గ జీర్ణించుకోలేక పోతున్నారు.