సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నెలలో వచ్చిన గోదావరి వరదలు మునుపెన్నడూ లేని రీతిలో ప్రభావం చూపాయని, సాయం అందించే విషయంలో ఉదారంగా స్పందించాలని విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ కేంద్ర బృందాన్ని కోరారు. హోంమంత్రిత్వ శాఖ ఆరి్థక సలహాదారు (ఎన్డీఎంఏ) రవినేష్ కుమార్ నేతృత్వంలోని బృందం రెండు రోజులపాటు గోదావరి వరదలకు ముంపునకు గురైన అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా, ఏలూరు జిల్లా, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో పర్యటించింది.
అనంతరం గురువారం రాష్ట్ర అధికారులతో సమావేశమైంది. రవినేష్ కుమార్‌తోపాటు బృందం సభ్యులు డాక్టర్.కె.మనోహరన్, శ్రావణ్ కుమార్ సింగ్, పి.దేవేందర్ రావు, ఎం.మురుగునాధన్, అరవింద్ కుమార్ సోని ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వరదల ప్రభావం, క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాన్ని సాయిప్రసాద్, విపత్తుల సంస్థ ఎండీ బి.ఆర్.అంబేడ్కర్ కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్ర కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ఉధృతిపై జిల్లా కలెక్టర్లకు సూచనలిచి్చనట్లు తెలిపారు. ముందుస్తుగానే జిల్లాల్లోకి సహాయక బృందాలను పంపించా మని వివరించారు.
10 ఎన్డీఆర్‌ఎఫ్, 11 ఎస్డీఆర్ ఎఫ్, 3 ఇండియన్ నేవీ బృందాలతో ముంపులో చిక్కుకున్న 183 మందిని రక్షించి, మరో 9 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. సహాయక బృందాలు కూడా చేరుకోలేని ఏలూరు జిల్లా కుకునూరు, వేలేరుపాడు మండలాల్లోని గ్రామాలకు హెలికాప్టర్ల ద్వారా ఆరు రోజుల పాటు ఆహారం, నిత్యావసరాలను అందించినట్లు తెలిపారు. గర్భిణుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించామన్నారు.
ప్రభుత్వ స్పందన భేష్
రవినేష్‌కుమార్ మాట్లాడుతూ మూడు జిల్లాల్లో వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించామన్నారు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు ఎక్కువగా నష్టం వాటిల్లిందని చెప్పారు. వరద సమయంలో ప్రభుత్వ చర్యలు, యంత్రాంగం సత్వర స్పందనను అభినందించారు. ముఖ్యం గా వలంటీర్ వ్యవస్థ సేవలు బాధితులకు అండగా నిలిచాయని ప్రశంసించారు. అత్యవసర సరీ్వసులను వెంటనే పునరుద్ధరించడంలో అధికారులు సమయస్ఫూర్తితో పనిచేశారని కొని యాడారు.
కలెక్టర్లకు వెంటనే నిధులు మంజూ రు చేయడంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టినట్టు గుర్తించామన్నారు. తమ నివేదికను త్వ రగా కేంద్ర ప్రభుత్వానికి అందిస్తామని, వీలైనంత మేర సహాయం అందించడానికి సహకారాన్ని అందిస్తామని తెలిపారు. సమావేశంలో విద్యుత్ శాఖ డైరెక్టర్ రమేష్ ప్రసాద్, ఇరిగేషన్ ఈఎన్‌సీ నారాయణరెడ్డి, ఆర్ అండ్ బీ ఈఎన్‌సీ నయిమ్‌ఉల్లా, ఆర్‌డబ్ల్యూఎస్ సీఈ హరేరాము, ఫిషరీస్ జేడీ హీరానాయక్, విపత్తుల సంస్థ ఈడీ సి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన
సాక్షి అమలాపురం: గోదావరి వరదల వల్ల కలిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటీ) గురువారం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించింది. రావులపాలెం మండలం గోపాలపురం, పి.గన్నవరం మండలం నాగుల్లంక, రాజోలు మండలం నున్నవారిబాడవలో నష్టాన్ని పరిశీలించింది.
పంట నష్టం, రైతులు, మత్స్యకారుల అభిప్రాయాలు, సాంకేతిక అంచనాలను సేకరించింది. వివిధ వర్గాలవారికి, రోడ్లు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలకు కలిగిన నష్టాన్ని పరిశీలించింది. ఫొటో ఎగ్జిబిషన్ తిలకించింది. జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా, రాష్ట్ర ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి వరదల వల్ల జరిగిన నష్టాన్ని, బాధితులకు అందించిన సాయాన్ని, దెబ్బతిన్న పంటల వివరాలను, రోడ్లు, విద్యుత్ లైన్లకు జరిగిన నష్టాన్ని ఛాయాచిత్రాలు చూపిస్తూ వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఆదుకుంది
ఆపదలో ఉన్న తమను రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఆదుకుందని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని వరద బాధిత రైతులు, మత్స్యకారులు, ప్రజలు కేంద్ర బృందానికి తెలిపారు. పునరావాసం కలి్పంచిందని, ఆహారం, తాగు నీరు అందించిందని వివరించారు. నిత్యావసర వస్తువులు, నగదు సాయం అందజేసిందన్నారు. కేంద్రంతో మాట్లాడి పంటలకు ఇచ్చే నష్ట పరిహారాన్ని పెంచేలా చూడాలని రైతులు ఈ బృందాన్ని కోరడం విశేషం.
కేంద్ర బృందంలో రవినేష్ కుమార్‌తోపాటు వ్యవసాయ సహకార రైతు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కె.మనోహరం, రోడ్డు రవాణా జాతీయ రహదారుల విభాగం ఎస్‌ఈ శరవన్ కుమార్ సింగ్, కేంద్ర జలశక్తి, జల వనరుల శాఖ సంచాలకులు పి.దేవేందర్ రావు, కేంద్ర ఆరి్థక శాఖ సహాయ కార్యదర్శి మురుగన్ నాదమ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అరవింద్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment