కొడుకును ఎమ్మెల్సీగా గెలిపించుకున్నారే తప్ప.. | teachers unhappy with chaitanyaraju | Sakshi
Sakshi News home page

కొడుకును ఎమ్మెల్సీగా గెలిపించుకున్నారే తప్ప..

Published Thu, Mar 26 2015 11:09 AM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

కొడుకును ఎమ్మెల్సీగా గెలిపించుకున్నారే తప్ప.. - Sakshi

కొడుకును ఎమ్మెల్సీగా గెలిపించుకున్నారే తప్ప..

హైదరాబాద్ :  ఆరేళ్లుగా ఎమ్మెల్సీగా ఉన్న చైతన్య రాజు పనితీరుపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏ ఒక్క ప్రజా సమస్యను కూడా ఆయన కౌన్సిల్లో లేవనెత్తకోపోయారని మండిపడుతున్నారు.  అధికార పక్షంతో అంటకాగి పదవుల కోసం పాకులాడారని చైతన్యరాజుపై టీచర్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. తన కొడుకు రవికిరణ్ వర్మను ఎమ్మెల్సీగా గెలిపించుకున్నారే తప్ప...ప్రజలకేమీ చేయలేకపోయారని వారు ధ్వజమెత్తుతున్నారు.

కాగా ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  పీడీఎఫ్ అభ్యర్థి రాము సూర్యారావు, టీడీపీ అభ్యర్థి ఏఎస్ రామకృష్ణ విజయం సాధించారు. ఉభయ గోదావరి జిల్లాలకు జరిగిన ఎన్నికల్లో యూటీఎఫ్ మద్దతిచ్చిన పీడీఎఫ్ (ప్రోగ్రెసివ్ డెమొక్రెటిక్ ఫ్రంట్) అభ్యర్థి రాము సూర్యారావు.. తన సమీప టీడీపీ ప్రత్యర్థి చైతన్యరాజుపై విజయం సాధించారు. మరోవైపు  టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థి కేవీవీ సత్యనారాయణరాజు(చైతన్యరాజు) ఓటమి ఆ పార్టీని కలవరానికి గురిచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement