గోదావరి జిల్లాలలో రాముసూర్యారావు విజయం | Ramu Surya Rao victory in Godavari Districts | Sakshi
Sakshi News home page

గోదావరి జిల్లాలలో రాముసూర్యారావు విజయం

Published Wed, Mar 25 2015 9:53 PM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

రాము సూర్యారావు - Sakshi

రాము సూర్యారావు

ఏలూరు: ఉభయగోదావరి జిల్లాల టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలలో  యుటీఎఫ్ అభ్యర్థి రాము సూర్యారావు విజయం సాధించారు. ద్వితీయ ప్రాధాన్యతా ఓట్లతో రాము సూర్యారావు గెలుపొందారు. టీడీపీ బలపరిచిన చైతన్యరాజు ఓడిపోయారు.

ఈ ఫలితం టీడీపీకి పెద్ద షాక్ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన 9 నెలలకే టీడీపీకి చేదు అనుభవం ఎదురైంది. ఈ జిల్లాలలోని ఉద్యోగస్తులలో చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీడీపీకి కంచుకోటగా చెప్పుకుంటున్న ఈ జిల్లాలలో ఓటమి ఆ పార్టీకి గట్టి దెబ్బగా భావిస్తున్నారు.

ఈ రోజు జరిగిన టీడీఎల్సీ సమావేశంలో ఈ ఎన్నికల అంశం చర్చకు వచ్చింది. ఇక్కడ అభ్యర్థి ఎంపికలో పొరపాటు జరిగినట్లు సమావేశం భావించినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement