
Teachers MLC Election Updates..
పోలింగ్ ప్రారంభం..
- ప్రారంభమైన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్
- ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న పోలింగ్
- ఏలూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్లు 2667..
- మొత్తం పోలింగ్ కేంద్రాలు 20..
- పశ్చిమ గోదావరి జిల్లాలోని 20 మండలాల్లో 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
- జిల్లాలో మొత్తం ఓటర్లు..3,729
- పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.
- బ్యాలెట్ పద్ధతి ద్వారా జరుగుతున్న పోలింగ్
👉గోదావరి జిల్లాల్లో రసవత్తర పోరుకు ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. శాసనమండలిలో ఖాళీ అవుతోన్న ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం జరగనుంది. ఇందుకు ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు.
👉ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల్లో 16,737 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 116 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు.
👉ఇక, సిట్టింగ్ ఎమ్మెల్సీ షేక్‌సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. మిగిలి ఉన్న రెండేళ్ల కాలానికి ఈ ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానం కోసం ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గంధం నారాయణరావు, పులుగు దీపిక, డాక్టర్ నాగేశ్వరరావు కవల, నామన వెంకటలక్ష్మి(విల్ల లక్ష్మి), బొర్రా గోపి మూర్తి బరిలో నిలిచారు. వీరంతా స్వతంత్రంగానే పోటీలో నిలిచారు. వీరిలో ప్రధాన పోటీ గంధం నారాయణరావు, బొర్రా గోపి మూర్తి మధ్యనే ఉండేలా కనిపిస్తోంది. గంధం నారాయణరావు రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో ఒక పర్యాయం పోటీ చేశారు. ఇప్పుడు మరోసారి పోటీ పడుతున్నారు.
👉ఈ శాసనమండలి ఎన్నికలకు నవంబర్ 11న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. గురువారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 9న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.
