AP: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. కూటమి అభ్యర్థి వెనుకంజ | AP Three MLC Election Results Live Updates | Sakshi
Sakshi News home page

AP: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. అప్‌డేట్స్‌

Published Mon, Mar 3 2025 7:38 AM | Last Updated on Mon, Mar 3 2025 5:48 PM

AP Three MLC Election Results Live Updates

MLC Election Results Updates..

గుంటూరు జిల్లా:

  • గుంటూరు - కృష్ణ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
  • పూర్తయిన మొదటి రౌండు
  • మొదటి రౌండులో  28, 000 ఓట్లు లెక్కింపు.
  • ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు  17,194 ఓట్లు
  • పిడిఎఫ్ అభ్యర్థి కే.ఎస్. లక్ష్మణరావు కు 7,214 ఓట్లు.
  • చెల్లని ఓట్లు3070
  • మిగిలిన 23 మందికి కలిపి:522
  • మొదటి రౌండ్ లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు మెజార్టీ :9980 ఓట్లు
     

గుంటూరు జిల్లా :

  • ప్రారంభమైన గుంటూరు - కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి రౌండ్  కౌంటింగ్
  • ఒక్కో టేబుల్ కి వెయ్యి ఓట్లు చొప్పున కౌంటింగ్ చేస్తున్న సిబ్బంది
  • మొత్తం 28 టేబుల్స్ ఏర్పాటు
  • మొదటి రౌండ్ లో లెక్కించనున్న 28 వేల ఓట్లు.
  • చెల్లని ఓట్లతో పాటు ప్రాధాన్యత క్రమంలో ఓట్లను వేరు చేస్తున్న సిబ్బంది
  • మరో అర్ధగంట లో ముగియనున్న మొదటి రౌండ్ కౌంటింగ్.

ఏలూరు జిల్లా : 

  • ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ
  • చెల్లిన ఓట్లు, చెల్లని ఓట్లు వేరు చేసిన అనంతరం లెక్కింపు ప్రక్రియ
  • 431పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు, పోలైన 243 ఓట్లు
  • పోస్టల్ బ్యాలెట్ లో చెల్లుబాటు కాని ఓట్లు 42
  • చెల్లుబాటు అయ్యే ఓట్లు 201 గా గుర్తించిన కౌంటింగ్ సిబ్బంది.
  • మిగతా 2లక్ష 18వేల 902 ఓట్లలో  చెల్లుబాటు అయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను విడతీస్తున్న  ఎన్నికల అధికారులు..
  • చెల్లుబాటు అయ్యే ఓట్లును 50 చొప్పున  కట్టలుగా కడుతున్న సిబ్బంది..
  • మొత్తం 28టేబుల్స్ పై 17రౌండ్ల పాటు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియ.
  • కౌంటింగ్ కోసం మూడు షిఫ్టుల్లో 700మంది సిబ్బంది..
  • రౌండ్ల వారీగా చెల్లుబాటైన  ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది
  • మొదటి రౌండ్లో 10,783 చెల్లుబాటు ఓట్లను లెక్కించిన సిబ్బంది
  • రెండో రౌండ్లో 13,929 చెల్లుబాటు ఓట్లు
  • మూడో రౌండ్లో 11,870 చెల్లుబాటు ఓట్లు
  • నాలుగో రౌండ్లో 13,777 చెల్లుబాటు ఓట్లు
  • 5వ రౌండ్లో 13,163 చెల్లుబాటు ఓట్లు
  • 6వ రౌండ్లో 14,783 చెల్లుబాటు ఓట్ల లెక్కింపు
  • 7వ రౌండ్లో 12841 చెల్లు బాటు ఓట్ల లెక్కింపు
  • 8వ రౌండ్లో 14296 చెల్లు బాటు ఓట్లు లెక్కింపు..

విశాఖ:

  • టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదలైన ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
  • ఎలిమినేషన్ రౌండ్ తో తేలనున్న ఫలితం
  • మొదటి ప్రాధాన్యత ఓట్లతో తేలని ఫలితం
  • మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీనివాసుల నాయుడుకు ఆధిక్యం 365
  • శ్రీనివాసులు నాయుడుకి 7210 ఓట్లు
  • రఘు వర్మకు 6845 ఓట్లు నమోదు
  • యూటీఎఫ్ అభ్యర్ధి  విజయగౌరికి 5804 ఓట్లు
     

విశాఖ.:

  • హోరాహోరీగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక..
  • మొదటి ప్రాధాన్యత ఓటుతో తేలని ఫలితం..
  • రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్న అధికారులు..
  • మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కింపులో పి ఆర్ టి యు అభ్యర్థి శ్రీనివాస నాయుడు 331 ఓట్ల ఆధిక్యత
  • శ్రీనివాసుల నాయుడుకు వచ్చిన ఓట్లు 6927
  • కూటమి బలపరిచిన అభ్యర్థి పాకలపాటి రఘువర్మ కు ఓట్లు 6596
  • యుటిఎఫ్ అభ్యర్థి విజయ గౌరీకి వచ్చిన ఓట్లు 5684

విశాఖ..

  • హోరాహోరీగా  ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలు.
  • టేబుల్ నెంబర్ 4, 14 లో ముగిసిన ఓట్ల లెక్కింపు..
  • కూటమి బలపరిచిన APTF అభ్యర్ధి పాకలపాటి రఘువర్మ వెనుకంజ..
  • 75 ఓట్ల ఆధిక్యంలో PRTU అభ్యర్ధి శ్రీనివాసుల నాయుడు
  • మొదట ప్రాధాన్యత ఓటులో ఫలితం తేలే అవకాశాలపై ఉత్కంఠ..
  • సుమారుగా చెల్లని ఓట్లు 250

విశాఖ..

  • హోరాహోరీగా  ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలు.
  • టేబుల్ నెంబర్-14 లో ముగిసిన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు..
  • APTF అభ్యర్ధి రఘువర్మపై 30 ఓట్ల ఆధిక్యంలో PRTU అభ్యర్ధి శ్రీనివాసుల నాయుడు
  • మొదట ప్రాధాన్యత ఓటులో ఫలితం తేలే అవకాశాలపై ఉత్కంఠ..
  • సుమారుగా చెల్లని ఓట్లు 250

 

విశాఖ..

  • ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీకి జరుగుతున్న కౌంటింగ్  
  • నువ్వా నేనా అన్నట్లు పోటీ..
  • స్వల్ప ఓట్లు ఆధిక్యంలో PRTU అభ్యర్ధి గాదె శ్రీనివాసులు నాయుడు..

ఏలూరు జిల్లా..

  • ఏలూరు సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో కొనసాగుతున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్..
  • 431పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు.. పోలైన 243 ఓట్లు
  • పోస్టల్ బ్యాలెట్‌లో చెల్లుబాటు కాని ఓట్లు 42
  • చెల్లుబాటు అయ్యే ఓట్లు 201గా గుర్తించిన కౌంటింగ్ సిబ్బంది.
  • మిగతా 2,18,902 ఓట్లలో చెల్లుబాటు అయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను విడతీస్తున్న ఎన్నికల అధికారులు..
  • చెల్లుబాటు అయ్యే ఓట్లును 50 చొప్పున కట్టలుగా కడుతున్న సిబ్బంది..
  • మొత్తం 28 టేబుల్స్ పై 17రౌండ్ల పాటు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియ.
  • కౌంటింగ్ కోసం మూడు షిఫ్టుల్లో 700మంది సిబ్బంది..

 

👉మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రకియ కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో లెక్కింపు ప్రారంభం.

👉ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ, ఏలూరు సీఆర్‌ రెడ్డి కాలేజీ, గుంటూరు ఏసీ కాలేజీలోని కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్లు లెక్కింపు జరుగుతోంది. 

👉రాష్ట్రంలో గత నెల 27న జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు 70 మంది అభ్యర్థులు పోటీ పడిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్ల నియోజక­వర్గం, ఉమ్మడి ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణ–గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్‌ జరగనుంది. ఈ మూడు స్థానా­లకు పోటీ అధికంగా ఉండడం, ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా లెక్కించాల్సి ఉండటంతో తుది ఫలితాలు వెలువడటానికి సుదీర్ఘ సమ­యం పడుతుందని అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ­కుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.  

విశాఖ..

  • ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు..
  • ఎనిమిది గంటలకు లెక్కింపు ప్రారంభం.
  • ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్కింపు..
  • బరిలో పదిమంది అభ్యర్థులు.
  • 123 బ్యాలెట్ బాక్సులు.
  • 20 టేబుల్స్ సిద్ధం చేసిన అధికారులు
  • మొత్తం ఓట్లు 20,493, పోలైన ఓట్లు 20,795.
  • తొలి ప్రాధాన్యత ఓటుతో తేలితే సాయంత్రం 5 గంటలకు ఫలితం.
  • లేదా రాత్రి 9 గంటల దాటే అవకాశం..
  • లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు..
  • కౌంటింగ్ కేంద్రం వద్ద మూడు అంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు..
  • కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు.
  • విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్న అధికారులు

గుంటూరు..

  • ఉమ్మడి కృష్ణ- గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల కౌంటింగ్
  • గుంటూరు ఏసీ కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియ
  • ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్
  • మొత్తం 29 టేబుల్ ఏర్పాటు
  • మూడు షిఫ్ట్ లో కౌంటింగ్ ప్రక్రియ
  • కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు


ఏలూరు జిల్లా..

  • ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్  
  • ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు.
  • 456 కేంద్రాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసిన 2,18,902 మంది  ఓటర్లు
  • మూడు షిప్టుల్లో 700 మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు
  • 28 టేబుల్స్ ఏర్పాటు
  • 17 రౌండ్స్‌లో తేలనున్న ఫలితం.
  • కౌంటింగ్ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement