
నేడు గోదావరి జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన
పంట నష్టపోరుున రైతులకు పరామర్శ
సాక్షి, కాకినాడ/ ఏలూరు: అకాల వర్షాలతో దెబ్బతిన్న పొలాలను పరిశీలించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉభ య గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. పంటల నష్టంతో కుదేలైన అన్నదాతలను ఆయన పరామర్శిస్తారు. జగన్ హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి శుక్రవారం ఉదయం 10.10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు.
అక్కడినుంచి రావులపాలెం మీదుగా దేవరపల్లి, ఈతకోట గ్రామాలకు వెళతారు. అక్కడ పంటల్ని పరిశీలించిన అనంతరం రోడ్డు మార్గంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు చేరుకుంటారు. దువ్వ, వరిఘేడు, తిరుపతిపురం, బల్లిపాడు గ్రామాల్లో పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు. పర్యటన అనంతరం శుక్రవారం సాయంత్రం రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుని అక్కడినుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారు.