సొంత సామాజిక వర్గానికి లాభం చేకూరేలా..
కాకినాడ: పంటల రుణమాఫీ విషయంలో టీడీపీ ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని పీపీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాణ విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేస్తోందని ఆరోపించారు. కాకినాడలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో చిరంజీవి, రఘువీరారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాజధాని విషయంలో సొంత సామాజిక వర్గానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం చేకూరేలా టీడీపీ సర్కారు వ్యవహరిస్తోందని అన్నారు. ఈ సమావేశంలో మాజీ కేంద్రమంత్రులు పళ్లంరాజు, జేడీ శీలం కూడా పాల్గొన్నారు.