ఒకట్రెండు జెడ్పీలు గెలవపోతే నష్టమేంటి?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్ధానిక ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యకరంగా వ్యవహరించిందని పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఒకటి, రెండు జెడ్పీలు గెలవకపోతే టీడీపీకి వచ్చే నష్టమేంటని టీడీపీని ఆయన ప్రశ్నించారు. నెల్లూరు జడ్పీ ఎన్నికలో కోరం ఉన్నప్పటికీ ఎన్నిక వాయిదా వేయడం అప్రజాస్వామికమని ఆయన విమర్శించారు. మెజారిటీ లేకపోయినప్పటికీ నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది.
పంటల రుణమాఫీపై చంద్రబాబు విధానాలు రైతులను గందరగోళపరుస్తున్నాయని బొత్స సత్యనారాయణ అన్నారు. రైతులు ముందు రుణాలు చెల్లిస్తే తర్వాత డబ్బులివ్వాలన్న చంద్రబాబు ఆలోచన సరికాదన్నారు. రుణాలు మాఫీచేయకపోతే రైతులే చంద్రబాబును నిలదీస్తారని హెచ్చరించారు.