ఆన్లైన్ లో రుణమాఫీ అర్హుల జాబితా | AP crop loan waiver list in online | Sakshi
Sakshi News home page

ఆన్లైన్ లో రుణమాఫీ అర్హుల జాబితా

Published Sun, Dec 7 2014 4:36 PM | Last Updated on Sat, Jun 2 2018 2:36 PM

ఆన్లైన్ లో రుణమాఫీ అర్హుల జాబితా - Sakshi

ఆన్లైన్ లో రుణమాఫీ అర్హుల జాబితా

హైదరాబాద్: తొలిదశ పంటల రుణమాఫీ అర్హుల జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకరోజు ఆలస్యంగా ఆన్లైన్ లో ఉంచింది. అర్హుల జాబితా http://apcbsportal.ap.gov.in/loanstatus లో చూడొచ్చు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, లోన్ ఎకౌంట్ నంబర్ల ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. ఈ మూడింటిలో ఏదో ఒక నంబర్ ఉంటనే అర్హుల వివరాలు వెల్లడవుతాయి.

తొలి దశ రుణ మాఫీ అర్హుల జాబితాను శనివారం ప్రచురిస్తామని, ఆన్‌లైన్‌లో పెడతామని, అందరూ చూసుకోవచ్చునని ఈ నెల 4వ తేదీన విలేకరుల సమావేశంలో చంద్రబాబు ప్రకటించారు. అయితే ఒకరోజు ఆలస్యంగా 7వ తేదీ మధ్యాహ్నానికి జాబితాను ఆన్లైన్ లో పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement