రుణమాఫీపై చంద్రబాబు తీరు దారుణంగా ఉందని వైఎస్ఆర్ సీపీ ఎంపీ వరప్రసాద్ విమర్శించారు.
తిరుపతి: రుణమాఫీపై చంద్రబాబు తీరు దారుణంగా ఉందని వైఎస్ఆర్ సీపీ ఎంపీ వరప్రసాద్ విమర్శించారు. రైతులను చంద్రబాబు నట్టేట ముంచారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఆశలను కల్పించి ఇప్పుడు మీనమేషాలు లెక్కించడం సిగ్గుచేటుని మండిపడ్డారు.
రిజర్వు బ్యాంకు ఇప్పటివరకు రుణమాఫీపై స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రులు రుణమాఫీపై రోజుకోమాట చెబుతూ పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. మన్నవరం ప్రాజెక్ట్, దుగరాజపట్నం ఓడరేవు సాధన కోసం వైఎస్ఆర్‌సీపీ ఢిల్లీలో పోరాటం చేస్తుందని చెప్పారు.