mannavaram project
-
‘బాబుకు పాలించే అర్హత లేదు’
సాక్షి, తిరుపతి: దొంగ హామీలతో అధికారం చేపట్టిన చంద్రబాబుకు పాలించే అర్హత లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాద్ అభిప్రాయపడ్డారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం చేపట్టిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం సిగ్గుచేటన్నారు. ఏపీలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవ చేశారు. దుగరాజు పట్నం పోర్టు రాకపోవడానికి నూటికి నూరు పాళ్లు చంద్రబాబే కారణమని మండిపడ్డారు. కృష్ణపట్నం పోర్టు కోసమే దుగరాజు పట్నంను అడ్డకున్నారని ధ్వజమెత్తారు. మన్నవరం ప్రాజెక్టు రాకతో బతుకులు మారతాయని ఆశపడిన జిల్లా ప్రజలు చంద్రబాబు అసమర్థతో నిరాశకు గురయ్యారని వివరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సీఎం అయితేనే మన్నవరం ప్రాజెక్టు బాగుపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
మన్నవరం ప్రాజెక్టును పూర్తిచేయండి
సాక్షి, న్యూఢిల్లీ : విద్యుత్తు ప్రాజెక్టుల స్థాపనలో ఈపీఎస్ కాంట్రాక్టుల అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన మన్నవరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో విస్తరించి త్వరగా పూర్తిచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన శనివారం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతెను కలిసి వినతిపత్రం ఇచ్చారు. వినతిపత్రంలోని వివరాలు ఇలా ఉన్నాయి.... మొదటి విడతలో రూ.1,200 కోట్లతో, రెండో విడతలో రూ.4,800 కోట్లతో మన్నవరం ప్రాజెక్టును స్థాపించాలని 2008లో ఎన్టీపీసీ, బీహెచ్ఈల్ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్టీపీసీ, బీహెచ్ఈల్ పవర్ ప్రాజెక్టు ప్రయివేటు లిమిటెడ్(ఎన్బీపీపీఎల్) ఏర్పడింది. కానీ కేంద్రం తొలి విడతగా రూ.1,200 కోట్లు వెచ్చించకుండా కేవలం రూ.364 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. ఇందులో కూడా కేవలం రూ.1,27 కోట్లు మాత్రమే ఇచ్చింది. విద్యుత్తు రంగానికి డిమాండ్ తగ్గిందని, సామర్థ్యానికి మించి విద్యుత్తు ప్రాజెక్టులు ఉన్నాయన్న ప్రచారం సరైనది కాదు. విద్యుత్ రంగానికి అవసరమైన యంత్రాలు, విభాగాలను వివిధ సంస్థలు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. అలాంటప్పుడు డిమాండ్ లేదని, సామర్థ్యానికి మించి విద్యుత్ సంస్థలు ఉన్నాయని ఎలా చెప్పగలం?. పైగా దేశంలో విద్యుత్తు రంగ యంత్రాలు, విడిభాగాల తయారీ తగ్గిపోతోంది. ఎన్బీపీపీఎల్ ఈ కొరతను తీర్చాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం విద్యుత్తు రంగ పరికరాల తయారీకి ఉద్దేశించినది మాత్రమే కాకుండా దేశంలోని, ఇతర దేశాల్లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అవసరమైన యంత్రాలు తయారు చేసేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు ఇది. కానీ ఎన్బీపీపీఎల్ ఈ విషయంపై ఎందుకు దృష్టిపెట్టడం లేదో అర్థం కాని పరిస్థితి. పైగా ఈ ప్రాజెక్టు నుంచి ఎన్టీపీసీ వైదొలిగినట్టు తెలుస్తోంది.. కారణమేంటో తెలియదు. విభజన అనంతరం నూతన ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క కేంద్ర పబ్లిక్ సెక్టార్ యూనిట్ కూడా మిగలలేదు. ఉన్న ఒక్క ఈ ఆశనూ కేంద్రం తుంచివేస్తోంది. ఈ వైఖరి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు విఘాతం కల్పిస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల ఉపాధి అవకాశాలు లభించి ఉండేవి. అందువల్ల మీరు స్వయంగా దీనిపై దృష్టిపెట్టి పూర్తిస్థాయిలో పెట్టుబడులు పెట్టి ప్రాజెక్టును అభివృద్ధి పరచాలని కేంద్ర మంత్రిని కోరారు. -
ఆ ప్రాజెక్టు తరలిపోతుంటే బాబు ఏం చేస్తున్నారు?
-
ఆ ప్రాజెక్టు తరలిపోతుంటే బాబు ఏం చేస్తున్నారు?
తిరుపతి: ప్రతిష్టాత్మక మన్నవరం ప్రాజెక్ట్ తరలిపోతుంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఏపీలో ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో కష్టపడి మన్నవరం ప్రాజెక్ట్ సాధించారని గుర్తు చేశారు. ప్రత్యేక సాయం ద్వారా పరిశ్రమలు వస్తాయనేది వట్టి భూటకమని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీనామా చేయిస్తామని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారన్నారు. తన ఎంపీలతో రాజీనామా చేయించే దమ్ము చంద్రబాబుకు ఉందా అని భూమన సవాలు విసిరారు. -
'రోజుకోమాటతో పబ్బం గడుపుతున్నారు'
తిరుపతి: రుణమాఫీపై చంద్రబాబు తీరు దారుణంగా ఉందని వైఎస్ఆర్ సీపీ ఎంపీ వరప్రసాద్ విమర్శించారు. రైతులను చంద్రబాబు నట్టేట ముంచారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఆశలను కల్పించి ఇప్పుడు మీనమేషాలు లెక్కించడం సిగ్గుచేటుని మండిపడ్డారు. రిజర్వు బ్యాంకు ఇప్పటివరకు రుణమాఫీపై స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రులు రుణమాఫీపై రోజుకోమాట చెబుతూ పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. మన్నవరం ప్రాజెక్ట్, దుగరాజపట్నం ఓడరేవు సాధన కోసం వైఎస్ఆర్సీపీ ఢిల్లీలో పోరాటం చేస్తుందని చెప్పారు.