ఆ ప్రాజెక్టు తరలిపోతుంటే బాబు ఏం చేస్తున్నారు? | bhumana karunakar reddy fires on chandrababu over mannavaram project | Sakshi
Sakshi News home page

ఆ ప్రాజెక్టు తరలిపోతుంటే బాబు ఏం చేస్తున్నారు?

Published Mon, Sep 26 2016 12:10 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

ఆ ప్రాజెక్టు తరలిపోతుంటే బాబు ఏం చేస్తున్నారు? - Sakshi

ఆ ప్రాజెక్టు తరలిపోతుంటే బాబు ఏం చేస్తున్నారు?

తిరుపతి:
ప్రతిష్టాత్మక మన్నవరం ప్రాజెక్ట్ తరలిపోతుంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఏపీలో ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో కష్టపడి మన్నవరం ప్రాజెక్ట్ సాధించారని గుర్తు చేశారు.

ప్రత్యేక సాయం ద్వారా పరిశ్రమలు వస్తాయనేది వట్టి భూటకమని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీనామా చేయిస్తామని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారన్నారు. తన ఎంపీలతో రాజీనామా చేయించే దమ్ము చంద్రబాబుకు ఉందా అని భూమన సవాలు విసిరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement