'మొట్టికాయ వేసే రోజు త్వరలోనే వస్తుంది' | god will punish tdp government, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

'మొట్టికాయ వేసే రోజు త్వరలోనే వస్తుంది'

Published Fri, Sep 19 2014 7:50 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

'మొట్టికాయ వేసే రోజు త్వరలోనే వస్తుంది' - Sakshi

'మొట్టికాయ వేసే రోజు త్వరలోనే వస్తుంది'

అనంతపురం: ప్రజా వ్యతిరేకతతో చంద్రబాబు ప్రభుత్వం కొట్టుకుపోయే రోజు దగ్గరలోనే ఉందని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. టీడీపీ సర్కారుకు దేవుడు మొట్టికాయ వేసే రోజు త్వరలోనే వస్తుందని వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లాలో నిర్వహించిన పార్టీ సమీక్షా సమావేశాలు ముగిసిన తర్వాత శుక్రవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు.

రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. రుణమాఫీకి ఇప్పటివరకు దమ్మిడి కూడా విదల్చలేదని చెప్పారు. అబద్దాలు, మోసాలతో చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేయకపోవడంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 2 లక్షల ఎకరాలకు నీరు అందేదని చెప్పారు. రుణమాఫీ కోసం అక్టోబర్ 16న చేపట్టనున్న మండల కార్యాలయాల ముట్టడి ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement