పంట రుణాల మాఫీపై తమ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని తెలంగాణ మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటెల రాజేందర్ అన్నారు. రుణమాఫీపై మంత్రివర్గ సబ్ కమిటీ చేసిన ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని వారు వెల్లడించారు. రుణమాఫీ కోసం రూ.4,250 కోట్లు చెల్లించనున్నట్టు తెలిపారు.