
అన్నిట్లోనూ అయోమయమే: పొన్నాల
సీఎం కేసీఆర్ విధానాల్లో స్పష్టత లోపించిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ విధానాల్లో స్పష్టత లోపించిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అన్ని అంశాల్లో అయోమయమే నెలకొందని విమర్శించారు. పంటల రుణమాఫీపై రైతులకు ఏ సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలతో రేషన్ కార్డులు, ఫీజురీయింబర్స్‌మెంట్, స్థానికత అంశాల్లో ప్రజలు అయోమయానికి గురవుతున్నారని అన్నారు.
భూముల స్వాధీనంలో సెంటిమెంట్‌ను జోడిస్తున్నారని, ఇతర అంశాలను నిర్లక్ష్యం చేస్తున్నారని పొన్నాల ఆరోపించారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని ఆయన అంతకుముందు వ్యాఖ్యానించారు. హామీలన్నీ అమలు చేసేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు వాచ్‌డాగ్‌లా వ్యవహరిస్తామన్నారు.