లక్షన్నర కంటే ఎక్కువ అప్పుంటే బినామీలే: బాబు | chandra babu blames crop loanees | Sakshi
Sakshi News home page

లక్షన్నర కంటే ఎక్కువ అప్పుంటే బినామీలే: బాబు

Published Fri, Jul 25 2014 2:14 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

లక్షన్నర కంటే ఎక్కువ అప్పుంటే బినామీలే: బాబు - Sakshi

లక్షన్నర కంటే ఎక్కువ అప్పుంటే బినామీలే: బాబు

లక్షన్నర కంటే ఎక్కువ పంట రుణాలు ఉన్నవాళ్లు బినామీలేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. కదిరిలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిజమైన రైతులు ఎవరికీ లక్షన్నర కంటే ఎక్కువ అప్పు ఉండదని, అంతకంటే ఎక్కువ అప్పులు ఉన్నవాళ్లు బినామీలే అవుతారని అన్నారు. తనకు ఏది న్యాయం అనిపిస్తే అదే చేస్తానని కూడా ఆయన చెప్పారు.

ఇదే సందర్భంలో డీఈడీ అభ్యర్థులపై కూడా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఉద్యమాలు చేస్తే ఉద్యోగాలు రావంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం అనిపిస్తే మాత్రం వాళ్లకు డీఎస్సీలో అవకాశం కల్పిస్తానని, లేకుంటే చేసేదేమీ లేదంటూ అసహనం వెళ్లగక్కారు. తనకు మొదట కార్యకర్తలే ముఖ్యమని, ఆ తర్వాతే ఓటేసిన ప్రజలని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement