'సన్మానాలే తప్ప బాబు ఒక్క రూపాయి ఇవ్వలేదు'
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రోజూ సన్మానాలు చేయించుకుంటున్న చంద్రబాబు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన గురువారమిక్కడ అన్నారు. రుణమాఫీ చేయకపోతే కనీసం కొత్త రుణాలైనా ఇవ్వాలన్నారు. ప్రయివేట్ ఇంజినీరింగ్ కాలేజీలపై టాస్క్ఫోర్స్ నివేదికను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు బయటపెట్టాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్పై ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి చర్చిస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు.