'ఊరికే కథలు చెప్పకు నాకు అన్నీ తెలుసు' | chandrababu angry on media persons | Sakshi
Sakshi News home page

'ఊరికే కథలు చెప్పకు నాకు అన్నీ తెలుసు'

Published Thu, Dec 4 2014 2:29 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

'ఊరికే కథలు చెప్పకు నాకు అన్నీ తెలుసు' - Sakshi

'ఊరికే కథలు చెప్పకు నాకు అన్నీ తెలుసు'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. రైతులను ఆదుకునేందుకు అన్ని చేస్తున్నామని చెప్పుకొచ్చారు. పంటల రుణమాఫీపై గురువారం ఆయన విధాన ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా రైతు ఆత్మహత్యలపై విలేకరులు ప్రశ్నించగా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఊరికే కథలు చెప్పకు నాకు అన్నీ తెలుసు. రాజకీయాలు చేయొద్దు' అంటూ మండిపడ్డారు. మీరు మళ్లీ అధికారంలోకి వచ్చాక 90 మంది వరకు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని విలేకరులు అడగ్గా... రైతులు ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నారు చెప్పండంటూ విలేకరులను ఎదురు ప్రశ్నించారు.

అనంతపురం కరువు జిల్లా కాబట్టి అక్కడ సమస్యలున్న మాట వాస్తవమేనన్నారు. అనంతపురం జిల్లా రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ ఇస్తామని హామీయిచ్చారు. కర్ణాటక సీఎంను ఒప్పించి హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి అనంతపురంకు నీళ్లు తీసుకొస్తున్నామని, తమ నిబద్దతకు ఇది నిదర్శనమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement