రాక్షస పాలన: ముద్రగడ ధ్వజం
కాపు జాతిపై కక్ష కట్టి రాక్షస పాలన సాగిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు.
జగ్గంపేట: కాపు జాతిపై కక్ష కట్టి రాక్షస పాలన సాగిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు. ‘మీరు, మీ యువరాజా మాత్రం 2050 వరకు ముఖ్యమంత్రిగా ఉండాలా?’ అని ప్రశ్నించారు. కాపు ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో బుధవారం నిరసన అనంతరం సాయంత్రం మద్దతు తెలిపేందుకు వచ్చిన వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
హక్కుల కోసం పోరాటం చేస్తుంటే అణగదొక్కేందుకు చూస్తున్నారని, అయితే కాపుల సత్తా ఏమిటో త్వరలోనే చూపిస్తామని హెచ్చరించారు. ఓపిక కాదు ఊపిరి ఉన్నంత వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు.